Rajya Sabha

రాజ్యసభ రేపటికి వాయిదా

Submitted by arun on Tue, 03/27/2018 - 12:22

రాజ్యసభను రేపటి(బుధవారం)కి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 15నిమిషాల వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలు సభలో నినాదాలు కొనసాగించారు. కావేరు బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. సభ సజావుగా జరగాలని చైర్మన్ కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

90 శాతం మంది రాజ్యసభ ఎంపీలు కోటీశ్వరులే..!

Submitted by arun on Sun, 03/25/2018 - 12:31

అమ్మో...! 90 శాతం మంది రాజ్యసభ ఎంపీలు కోటేశ్వరులే. 229 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల్లో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి 55 కోట్లు ఉంది. అందులో 4078.41 కోట్లతో అగ్రస్థానంలో జేడీయూ ఎంపీ మహేంద్ర ప్రసాద్, 1001.64 కోట్లతో రెండో స్థానంలో జయా బచ్చన్, 857.11 కోట్లతో మూడో స్థానంలో రవీంద్ర కిశోర్ ఉన్నారు. 

రాజ్యసభ రేపటికి వాయిదా

Submitted by arun on Wed, 03/21/2018 - 11:57

పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన 30 సెకన్లపై లోక్‌సభ ఆందోళనల మధ్య వాయిదా పడటంతో రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పెద్దల సభలోనూ ఎంపీలు ఆందోళన సాగడంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా వేయడం జరిగింది.

ఈరోజు ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కావేరీ బోర్డు అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ తమ స్థానంలో ఆసీనులు కాగానే సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ వారించినా వారు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ఆ 39 మంది భారతీయులు చనిపోయారు

Submitted by arun on Tue, 03/20/2018 - 12:27

ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్‌ ఘటన విషాదాంతమైంది. నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న ఆ 39 మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 2014లో ఇరాక్‌లో కిడ్నాప్ అయిన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వారందరినీ  ఐఎస్ ఉగ్రవాదులు  పొట్టనపెట్టుకున్నారని సుష్మ ప్రకటించారు.
 

సంతోష్‌రావు‌‌కు రాజ్యసభ ఖరారు

Submitted by arun on Tue, 03/06/2018 - 14:13

ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటుకి అభ్యర్థిని ఖరారు చేశారు గులాబీబాస్. తనకు అత్యంత సన్నిహితుడు, బంధువైన జోగినపల్లి సంతోష్‌ రావుని పెద్దలసభకు పంపనున్నారు కేసీఆర్. సంతోష్‌కు రాజ్యస‌భ సీటు ఖ‌రారైందని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలినప రెండు సీట్లు ఎవరికి కేటాయించాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు టీఆర్ఎస్ దళపతి.

రాజ్యసభ రేపటికి వాయిదా

Submitted by arun on Mon, 03/05/2018 - 14:55

ఎన్ని వాయిదాలు పడినా రాజ్యసభలో పరిస్థితి మారడం లేదు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభంకాగా.. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాల్సిందేనంటూ ఏపీ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. ఛైరన్మన్‌  వెల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ఎంతగా వారించినా సభ్యులు వినిపించుకోలేదు. ఇదే సమయంలో కావేరీ జల వివాదంపై అన్నాడీఎంకే సభ్యులు సైతం ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు.

రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి

Submitted by arun on Thu, 02/08/2018 - 17:47

ఈ మధ్య కాలంలో అరుదుగా వినిపిస్తున్న పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో లేవనెత్తారు. టీడీపీ ఎంపీ సుజనాచౌదరి మంత్రివర్గంలో ఉంటూ నిరసన తెలపడంపై విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కేబినెట్ నిర్ణయంతో విభేదించిన మంత్రిని రాజ్యసభలో ఎలా మాట్లాడనిస్తారని విజయసాయి ప్రశ్నించగా.. కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వొచ్చని, సుజనా మాటలు కేబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకం కాదని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు రూలింగ్ ఇచ్చారు. 

రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్‌

Submitted by arun on Wed, 02/07/2018 - 11:58

రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు సస్పెన్షన్ అయ్యారు. కేవీపీని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీ పార్లమెంటు బయట, రాజ్యసభ లోపల ఆందోళన నిర్వహిస్తున్నారు. రాజ్యసభలో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కేవీపీపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేశారు.
 

ఏపీ ఎంపీల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం

Submitted by arun on Tue, 02/06/2018 - 17:08

తాజా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, విభజన చట్ట ప్రకారం ఏపీకి చాలా సంస్థలు ఇచ్చామని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శిని త్వరలోనే ఢిల్లీకి పిలిపిస్తున్నామని, ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు రూపిందిస్తామని జైట్లీ తెలిపారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి పేర్కన్నారు.