controversy comments

భార‌త జ‌వాన్ల‌పై బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్య‌లు

Submitted by arun on Tue, 01/02/2018 - 17:07

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లెత్‌పోరలో సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో  నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడుల‌కు పాల్ప‌డింది తామేనంటూ  నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. జైషే మహ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ తాంత్రేను గత మంగళవారంనాడు పుల్వామా జిల్లా సంబూర గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ ప్రతీకారదాడులు చోటుచేసుకున్నాయి.  అయితే భార‌త జ‌వాన్ల మ‌ర‌ణంపై బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ దారుణ‌ వ్యాఖ్య‌లు చేశారు.

చిక్కుల్లో పడ్డ కలెక్టర్‌.. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ తిట్ల దండకం

Submitted by arun on Thu, 12/21/2017 - 13:35

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మురళి తాను వివాదాస్పద కలెక్టర్‌నని మరోసారి నిరూపించుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌ చేస్తూ అన్ని వర్గాల నోళ్లల్లో నానుతున్న కలెక్టర్‌ మురళీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. జిల్లా ఎంపీడీవోల సమావేశంలో అధికారులకు నోరుజారి చిక్కుల్లో పడ్డారు. ఎక్కువ జీతం తీసుకుంటూ టైమ్‌పాస్‌ చేస్తున్న అధికారులు దున్నపోతులు, వెధవలంటూ వ్యాఖ్యలు చేయడంతో ఎంపీడీవోలు సామూహిక నిరసనలకు దిగారు.