Virat Kohli

కోహ్లి సెంచరీకి అనుష్క ఫిదా

Submitted by arun on Fri, 02/02/2018 - 17:53

వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికాతో ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. డర్బన్ కింగ్స్ మీడ్ వేదికగా ముగిసిన తొలివన్డేలో అజింక్యా రహానేతో కలసి తనజట్టుకు 6 వికెట్ల అలవోక విజయం అందించాడు. కొహ్లీ 119 బాల్స్ లో 10 బౌండ్రీలతో 112 పరుగులు సాధించాడు. తన వన్డే కెరియర్ లో 203వ మ్యాచ్ లో విరాట్ 33వ శతకంతో ఈ ఘనత సాధించాడు. క‌ఠిన‌మైన డ‌ర్బ‌న్ పిచ్‌పై అద్భుత‌మైన ఆటతీరుతో కోహ్లీ అంద‌ర్నీ ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌కు అన్నివైపుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ప్రముఖులు కూడా ట్విట‌ర్ ద్వారా కోహ్లీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

"బలీ కా బకరా"

Submitted by lakshman on Sun, 01/14/2018 - 23:28

టీమిండియా కెప్టెన్ పై మాజీ క్రికెటర్లు మండిప‌డుతున్నారు. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ఆట‌గాళ్ల ప్ర‌తిభ‌ను తొక్కే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టీమిండియా- సౌత్రాఫ్రికా ల మ‌ధ్య  టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. అయితే టెస్ట్ కోసం జ‌ట్టులో మార్పులు జ‌రిగాయి. ఆ మార్పులపై సీనియ‌ర్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ధవన్, భువనేశ్వర్‌లను తొలగించి వాళ్ల స్థానంలో రాహుల్, ఇశాంత్‌లను సెల‌క్ట్ చేసుకోవ‌డం స‌రైంద‌ని కాద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. జ‌ట్టు ఎంపిక విష‌యంలో కెప్టెన్ కోహ్లీని త‌ప్పుబ‌ట్టిన మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌ళ్లీ పెళ్లి

Submitted by lakshman on Sun, 01/14/2018 - 22:26

 నాలుగేళ్ల తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విరాట్‌ కోహ్లీ, అనుష్క లు వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.  గ‌త ఏడాది ఇటలీ వైన్‌ రాజధానిగా పేరు తెచ్చుకున్న మోంటాల్కినోకు గంట ప్రయాణం దూరంలో ఉన్న ఓ రిసార్ట్ లో వివాహం ఘ‌నంగా జ‌రిగింది. అయితే వీరి వివాహం చెల్లుబాటు కాద‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం వారు విరాట్-అనుష్క ఇండియాలో పెళ్లి చేసుకోలేద‌ని..జ‌ర్మనీలో పెళ్లి చేసుకున్నార‌ని..కాబ‌ట్టి వీరి వివాహం ఇండియాలో చెల్ల‌ద‌ని అంటున్నారు. అంతేకాదు వీరిద్ద‌రు మ‌ళ్లీ పెళ్లి చేసుకొని మ్యారేజ్ స‌ర్టిఫికెట్ తెచ్చుకోవ‌చ్చని సూచిస్తున్నారు.

భారత్‌లో మరోసారి ‘విరుష్క’ వివాహం?

Submitted by arun on Sun, 01/14/2018 - 10:55

మొన్నామధ్యే ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకుకుని, ఇండియాలో ఘనంగా విందు కూడా ఇచ్చారుగా? వీరి మధ్య మళ్లీ పెళ్లేంటని అనుకుంటున్నారా? నిజమేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం. దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం వీరు ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇటలీలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సామాజిక మాధ్యమాల ద్వారా తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత దిల్లీ, ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధాని మోడీని కలిసిన విరుష్క జంట

Submitted by arun on Thu, 12/21/2017 - 11:13

విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు హాజరవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విరుష్క జోడీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ-అనుష్కశర్మలు ఈనెల 11న ఇటలీలోని టస్కనీలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్‌కు చేరుకున్న కొత్త దంపతులు మోదీని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. నేడు ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కోహ్లీ దంపతులు విందు ఇవ్వనుండగా, ఈనెల 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు.

రేపే విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్

Submitted by arun on Wed, 12/20/2017 - 17:23

భారత సెలిబ్రిటీ కొత్తజంట విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ న్యూఢిల్లీ వేదికగా తమ వివాహ తొలివిందుకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే ఈ విందులో ఢిల్లీ క్రికెట్ వర్గాలతో పాటు విరుష్కల బంధువులు, స్నేహితులు పాల్గొనబోతున్నారు. ఇటలీలోని టస్కనీలో ఇటీవలే పెళ్లివేడుకలు, యూరోప్ లోని శీతాకాల విడిది కేంద్రాలలో హానీమూన్ జరుపుకొన్న విరుష్కజంట ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే తమ తాజా ఫోటోని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేర్చారు. అంతేకాదు ముంబైలోని బాలీవుడ్, క్రికెట్ వర్గాల కోసం ఈనెల 26న విరుష్క జోడీ మరోసారి వివాహవిందును ఏర్పాటు చేయబోతున్నారు.