Virat Kohli

కోహ్లీ @ 10000

Submitted by arun on Wed, 10/24/2018 - 16:18

అచ్చొచ్చిన విశాఖలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ దుమ్మురేపాడు. అద్భుతమై బ్యాటింగ్ ప్రతిభతో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు.  కెరీర్‌లో 10 వేల పరుగుల మైలురాయిని సాధించాడు. ఇంతకు ముందే భారత్‌లో వేగంగా 4వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన అతడు విండీస్‌పై అత్యధిక పరుగులు (1574) చేసిన భారత ప్లేయర్ గా  నిలిచాడు. 
 

కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా

Submitted by arun on Sat, 10/13/2018 - 16:07

కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా... తన కోచ్ రాజ్కుమార్ శర్మ యొక్క శిక్షణలో ఎనిమిదేళ్ళ వయసులో కోహ్లి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 1996-97లో, రాజ్కుమార్ శర్మ తన అకాడమీని ప్రారంభించారు, కోహ్లి మొదటి 200 మంది విద్యార్థుల్లో ఒకరు. క్రికెట్ కౌన్సిల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, రాజ్కుమార్ మాట్లాడుతూ, "ఒక వారంలోనే విరాట్ నిస్సందేహంగా ఉత్సాహంతో పాటు అద్భుతమైన ప్రతిభ కలిగి వున్నడని నాకు అర్ధం అయ్యింది అన్నాడు. అలాగే  అతను ఎంతో ఉత్సాహవంతుడు మరియు నన్ను చాల ప్రశ్నలు అడిగేవాడు అన్నాడు. ఆట యొక్క అన్ని అంశాలను తెలుసుకోవడానికి అతని ఆత్రుత నన్ను పూర్తిగా ఆకట్టుకుంది అని అన్నడు.

తండ్రిని కోల్పోయినా వృత్తిని గౌరవించాడు కోహ్లి

Submitted by arun on Sat, 10/13/2018 - 16:02

డిసెంబర్ 19, 2006 న కోహ్లి ఉదయం తన తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ, కర్ణాటకతో జరిగిన ఒక రంజీ ట్రోఫి ఆట కోసం ఆ రోజు అతను ఢిల్లీకి వెళ్ళాడు. అంతకుముందు రోజు అతను 40 పరుగులతో అజేయంగా నిలిచాడు, ఆ రోజు 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇది సీనియర్ ప్రతినిధిగా ఆడే క్రికెట్లో అది అతని మొదటి యాభై. ఆ ఆట అయిన తర్వాతే..కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు అయ్యాడు. ఇది తనకి క్రికెట్ పట్ల వున్నా గౌరవం మరియు తన స్వభావాన్ని ముందస్తు సంకేతం నిలిచిందని చాలామంది విశ్లేషకులు అంటారు. శ్రీ.కో.

విరాట్ కోహ్లీ కాప్టైన్ గా...

Submitted by arun on Tue, 10/09/2018 - 15:18

ఒక్కో నాయకుడు.. ఒక్కో తిరుగా తన ప్రభావాన్ని తన జట్టుపై  చూపెడతాడు.. అది రాజకీయం లోనైనా.. ఆటల్లో నైన..  అలాగే ప్రతి భారత క్రికెట్ టీం యొక్క కెప్టెన్ తనదైన శైలి లో జట్టును ముందుకు నడుపుతూ వుంటాడు.. అలాగా. మన విరాట్ కోహ్లీ కాప్టైన్ గా బాద్యతలు తీసుకున్నప్పటి నుండి.. ఎదుటి టీం .. ఎన్ని రన్స్ చేసినా.. తన దూకుడు తగ్గియకుండా గెలిచాడు.. అలా వన్డేలలో దాదాపు 300 స్కోరును దాటిన కూడా  5 సార్లు వెంబడించారు. అలా వెంటాడం .. వేటాడం...నేర్చాడు... మనోడు.  శ్రీ.కో.
 

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న కోహ్లి, మీరాబాయ్ చాను

Submitted by arun on Tue, 09/25/2018 - 17:37

భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2018 కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా  ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 2016 సీజన్లోనే ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు. అయితే గత ఏడాదికాలంగా అసాధారణంగా రాణించిన కొహ్లీ ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేస్ లో కొహ్లీ, చాను

Submitted by arun on Mon, 09/17/2018 - 17:24

భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రేసులో  టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను పోటీపడుతున్నారు. 2016 సీజన్లోనే ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు. అయితే  గత ఏడాదికాలంగా అసాధారణంగా రాణించిన కొహ్లీ ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం ఆటగాడిగా, కెప్టెన్ గా అందుకోగలిగాడు.

కోహ్లీ షాంపైన్‌ బాటిల్‌ కథ

Submitted by arun on Thu, 08/23/2018 - 14:16

క్రికెట్‌ జట్టు కెప్టెన్, చిచ్చర పిడుగు, విరాట్‌ కోహ్లీ,

తన కోచ్‌ రవిశాస్త్రికి విజయసూచికగా చూపుతూ,

ఓ ప్రతేకమైన కానుక ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

అది ఒక  షాంపైన్‌ బాటిల్‌ చేతిలో ఉంచుతూ.  శ్రీ.కో. 

ముంబై చెత్త వివాదంలో విరుష్క జోడీ

Submitted by arun on Mon, 06/18/2018 - 18:01

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ...ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు. లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని అనుష్క మందలించడం దానిని వీడియో తీసి విరాట్ కొహ్లీ నెట్ లో పోస్ట్ చేయటం పట్ల మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. చివరకు అనుష్క పరిస్థితి తిట్టబోయి తిట్లుతిన్నట్లుగా తయారయ్యింది.

కోహ్లీ సవాలును స్వీకరించిన మోదీ

Submitted by arun on Thu, 05/24/2018 - 11:25

‘హమ్ ఫిట్‌ తో ఇండియా ఫిట్’ పేరిట కేంద్రమంత్రి రాజ్య వర్థన్ సింగ్ చేసిన ఫిట్‌నెస్ చాలెంజ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించారు. వెంటనే తాను చేసిన ఓ వ్యాయామానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానితో పాటు ఈ ఛాలెంజ్‌‌ను స్వీకరించాల్సిందిగా తన భార్య, నటి అనుష్క శర్మకు, ప్రధాని నరేంద్ర మోదీకి, టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పేర్లను ట్యాగ్ చేశారు. అయితే కోహ్లీ సవాలుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విరాట్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలోనే తన వీడియో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు. మనం ఫిట్‌గా ఇండియా ఫిట్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు.