Chandrababu Naidu

టీ కప్పులో తుపాను

Submitted by arun on Thu, 06/21/2018 - 17:55

మంత్రి గంటా శ్రీనివాసరావు అలక ఎపిసోడ్  టీ కప్పులో తుపానులా ముగిసింది. హోమ్ మినిస్టర్ చినరాజప్ప, వియ్యంకుడు మంత్రి నారాయణల  ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడిన తరువాత గంటా ఎట్టకేలకు మెత్తబడ్డారు.  మూడు రోజుల నుంచి విధులకు దూరంగా ఉణ్న ఆయన సీఎం పర్యటనలో పాల్గొన్నారు.  

ప్రధాని మోడీ ఎదుట కుండ బద్ధలు కొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 06/18/2018 - 10:18

దేశంలో చారిత్రక మార్పునకు నీతిఆయోగ్‌ వేదిక అవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు, సలహాలు భవిష్యత్ విధాన నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రాలు సూచించిన అంశాలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్‌కు ఆదేశించారు. 115 జిల్లాల్లో 45వేల గ్రామాలకు ఏడు కీలక పథకాలను 2018 ఆగస్టు 15 కల్లా చేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. అయితే, ఈ సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగంతో వేడెక్కింది. ఆయన తనకిచ్చిన సమయం మించి మరీ  ప్రధాని మోడీ ఎదుట..తాను చెప్పాల్సింది చెప్పేశారు. 

ఇక అందరి చూపూ అటువైపే

Submitted by arun on Sat, 06/16/2018 - 18:07

కేంద్రం నుంచి బయటకొచ్చాక.. ఎన్డీయేకు రాం రాం చెప్పాక.. మంత్రి పదవులను కాదని వదిలిపెట్టాక.. రాష్ట్రంలో కూడా తెగదెంపులు చేసుకున్నాక.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాక.. మళ్లీ.. ఇన్నాళ్లకు.. ఆ ఇద్దరు ఎదురెదురు పడుతున్నారు. ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఒకరి ముఖం మరొకరు చూసుకోబోతున్నారు. వారే ఒకరు తెలుగు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరొకరు దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ. చాలాకాలం తర్వాత ఆ ఇద్దరు లెజెండ్స్.. కలవబోతున్నారు. మరి వారి భేటీ ఎలా సాగనుంది..? అందరిలో ఆసక్తిని.. అంతకుమించిన ఉత్కంఠను పెంచుతున్న వీరిద్దరి సమావేశం ఎలా ఉండబోతోంది..? 

ముందస్తు సంకేతాలిచ్చిన చంద్రబాబు

Submitted by arun on Wed, 06/13/2018 - 10:12

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు సంకేతాలు ఇచ్చారు. సాధారణ ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయని.. సిగ్నల్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో దీనికి సంబంధించి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. అంతేకాకుండా.. వారి నుంచి తీసుకున్న ఫీడ్‌ బ్యాక్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. తన దగ్గర అందరి లెక్కలున్నాయని.. స్పష్టం చేశారు. 

టీడీపీలో చేరకపోతే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు

Submitted by arun on Mon, 06/11/2018 - 13:06

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్యాలరావు, దగ్గుబాటి పురందేశ్వరి,విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ నాయుడు, కవితలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీలో అవినీతి, అసమర్థ, అరాచక పాలన నడుస్తోంది : కన్నా

Submitted by arun on Mon, 06/11/2018 - 12:02

ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గోకరాజు గంగరాజు, మాణిక్యాలరావు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ టీడీపీ పాలనలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అసమర్థ, ఆరాచక పాలన నడుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష‌్మినారాయణ విమర్శించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మోసాలను, మాయమాటలను ప్రజలకు వివరిస్తామన్నారు.

చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన వైసీపీ

Submitted by arun on Fri, 06/08/2018 - 15:39

సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. వైసీపీ విడుదల చేసిన ఛార్జిషీట్, టీడీపీ మ్యానిఫెస్టోలను దగ్గర పెట్టుకుని సరిచూసుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తానని బాబు ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిల పడ్డారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తేలేక పోయారని అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు పేల్చిన జగన్‌‌

Submitted by arun on Tue, 06/05/2018 - 19:33

తన చేతికి గడియారం ఉండదు... వేలికి ఉంగరం ఉండదు.... మెడలో బంగారు గొలుసు ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై... వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. వేలికి ఉంగరం, మెడలో గోల్డ్‌ చైన్‌ ఉండదు కానీ... రెండెకరాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆస్తి మాత్రం సంపాదించారని అన్నారు. చంద్రబాబు చేతికి గడియారం ఉండదు కానీ వేలకోట్ల హెరిటేజ్‌ కంపెనీ... రాజభవనంలాంటి ఇల్లు... ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్ల నల్లధనం మాత్రం ఉన్నాయన్నారు. అమ్మాయిల వంక చూడనంటూ... 70ఏళ్ల వయసులో చంద్రబాబు చెప్పడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. చంద్రబాబు మద్యం తాగరు కానీ...

చంద్రబాబు పాలనలో అవినీతి విశ్వవ్యాప్తమైంది: భూమన

Submitted by arun on Tue, 06/05/2018 - 14:16

చంద్రబాబు పాలనలో అవినీతి విశ్వవ్యాప్తమైందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చేతికి వాచి, వేలికి ఉంగరం లేదంటూ ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు ...నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతికి  పాల్పడ్డారంటూ ఎద్దేవా చేశారు. నవనిర్మాణ దీక్షతో  ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు ఎయిర్ ఏసియా వివాదంలో  తన ఆడియో టేప్ వెలుగుచూసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

ఆ ఘనత టీడీపీ ప్రభుత్వానిదే : చంద్రబాబు

Submitted by arun on Mon, 06/04/2018 - 17:47

ఒక్కో రైతుకు లక్షన్నర చొప్పున రుణ మాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణ మాఫీ చేయలేదని విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం, ఆర్బీఐ రైతు రుణ మాఫీకి అంగీకరించకపోయినా..ఇచ్చిన మాటకు కట్టుబడి  అన్నదాత అప్పుల్ని రద్దు చేశామని చెప్పారు. గతంలో రైతులకు ఎన్నో కష్టాలుండేవని..కానీ టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులను అప్పల ఊబి నుంచి బయటకు తెచ్చామని చంద్రబాబు అన్నారు.