mla roja

ఎమ్మెల్యే రోజాపై మండిప‌డ్డ కోటా శ్రీనివాస‌రావు

Submitted by lakshman on Tue, 01/09/2018 - 00:02

  వైసీపీ ఎమ్మెల్యే రోజాపై న‌టుడు కోట శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు. కొద్దిరోజుల క్రితం రోజా నిర్మాత బండ్ల‌గ‌ణేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే.  ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రోజా-బండ్ల‌గ‌ణేష్ లు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై స్పందించారు. ఆ స‌మ‌యంలో  వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ ను  ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌శ్నించ‌డంపై వారి మధ్య మాటలు శ్రుతిమించాయి. వీరిద్దరి మధ్య చ‌ర్చ‌లు తారాస్థాయికి చేరుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదంపై కోటా స్పందించారు. రోజాను ఓ రాజ‌కీయ నాయ‌కురాలిగా చూడ‌డంలేద‌ని అన్నారు. 

చంద్రబాబు, లోకేష్‌పై విరుచుకుపడ్డ రోజా..ఎందుకు పనికిరాడంటూ లోకేష్‌పై సెటైర్లు

Submitted by arun on Sat, 01/06/2018 - 11:31

వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టారంటూ నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సెటైర్లు వేశారు. ఇక ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన దద్దమ్మ అంటూ చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు.

మహిళల పంతం.. చంద్రబాబు పాల‌న‌ అంతం: రోజా పిలుపు

Submitted by arun on Wed, 12/27/2017 - 11:20

చంద్రబాబు పాలన రావణాసుడు, నరకాసురుడు కలిసి పాలించినట్టుగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంత‌పురం జిల్లా ధ‌నియాని చెరువు వ‌ద్ద జ‌గ‌న్ ‌పాదయాత్రలో పాల్గొన్న రోజా చంద్రబాబు పాలన అంతానికి మహిళలంతా పిడికి బిగించి శపథం చేయాలని కోరారు.
 

మహిళ మంత్రులపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 12/20/2017 - 18:32

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఇక్కడి మహిళా మంత్రులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ‘మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?’ అంటూ చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సమావేశంలో మరో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీడీపి నాయకులు ఇసుక, మట్టి గ్రానైట్ ఏ ఒక్కదాన్ని వదలడం లేదన్నారు. ఇక్కడ కట్టుకున్న మరుగుదొడ్లకు బెంగళూరు బ్యాంకు అకౌంట్లకు నిధులు విడుదల అవుతున్నాయని అన్నారు.

ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

Submitted by lakshman on Wed, 12/20/2017 - 15:05

ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా అంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ను వ్యతిరేకించిన క్రిటిక్ కత్తిమషేష్ తాజాగా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ పై మండిపడ్డారు. పవన్  అజ్ఞాతవాసి సినిమా అయిపోయింది. బిజినెస్ బాగా జరిగింది. ఇక ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడు.  "పాలిటిక్స్‌ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ పోయినట్లు ఉందే..  కొన్ని వీడియోల్నీ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.