kathi mahesh

పొలిటికల్ ఎంట్రీపై కత్తి క్లారిటీ.. చిత్తూరు జిల్లా నుంచే పోటీ

Submitted by arun on Mon, 07/02/2018 - 13:35

సినీ, రాజకీయ విశ్లేషకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న కత్తి మహేష్, పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తోంది. తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ఎంపీ గా బరిలోకి నిలవాలన్నతన ఉద్దేశ్యాన్ని తాజాగా బయటపెట్టారు కత్తి మహేష్. ఏ పార్టీ లో జాయిన్ అయ్యేది, ఎక్కడి నుంచి పోటీ చేస్తాన్నది త్వరలోనే సగర్వంగా ప్రకటిస్తానన్నారు. ఏదో పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా నామినేట్ అయిపోవడం ఇష్టం లేదన్నఆయన, ఎవరి నుంచి పిలుపు వస్తుందో, తనను ఎవరు స్వాగతిస్తారన్నది చూడాలని అన్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. అన్ని పార్టీలతో తాను టచ్‌‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు

Submitted by arun on Sat, 06/30/2018 - 13:45

సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాముడిని దుర్భాషలాడారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌  ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’  అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘భరత్ అనే నేను’పై కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 04/20/2018 - 13:03

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఒక్క సినిమా..హై ఎక్స్ పెక్సేషన్స్ తోనే రిలీజవుతుంది. కానీ భరత్ అనే నేను సినిమా మాత్రం ఇంకాస్త ప్రత్యేకం. అందుకే ఈ సినిమా మహేశ్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో సందడి చేస్తోంది. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌ మరింత జోష్‌లో ఉన్నారు.

‘కృష్ణార్జున యుద్ధం’పై కత్తి రివ్యూ

Submitted by arun on Thu, 04/12/2018 - 15:58

హీరోలకు ఒక్క హిట్ పడితేనే ఉబ్బితబ్బిబవుతారు. ఆనందానికి అవదులే లేనట్టు గాల్లో తేలిపోతుంటారు. అలాంటిది నాచురల్ స్టార్ నాని..ఒకటి కాదు ,రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు కొట్టాడు. అవి కూడా బ్యాక్ టు బ్యాక్. ప్రజెంట్ మరే హీరోకు లేని ఘనతను సాధించిన నాని తొమ్మిదో హిట్ కు సందడి మొదలెట్టాడు. హిట్ అనే పదానికి కేరాఫ్ గా మారిపోయాడు నాచురల్ స్టార్ నాని. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైన నాని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వైవిధ్యమైన స్టోరీలతో ప్రజెంట్ టాలీవుడ్ లో మరే హీరోకు లేని సక్సెస్ రేటును కంటీన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది విజయాలను ఖాతాలో వేసుకున్న నాని, తొమ్మిదో హిట్ కు రెడీ అయ్యాడు.

‘ఛల్ మోహన్ రంగ’..కత్తి రివ్యూ

Submitted by arun on Thu, 04/05/2018 - 15:20

లవర్ బోయ్  నితిన్.. ట్వంటీ ఫిఫ్త్ మూవీ.. ఛల్ మోహన రంగ రిలీజ్ అయ్యింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించారు. అయితే ఈ సినిమా కొంత లవ్ స్టోరీ.. ర్యాండమ్‌గా ఫన్ యాడ్ అయిందంటూ కత్తి మహేష్ పేర్కొన్నారు.
 
‘‘ఛల్ మోహన్ రంగ కొద్దిగా లవ్ స్టోరీ.. దీనికి ర్యాండమ్‌గా కొంచెం ఫన్ యాడ్ చేశారు. నితిన్ బాగా నటించాడు. మేఘన నటన సింపుల్‌గా ఉంది. ఈ లవ్ స్టోరీ వేరే ఏ లవ్ స్టోరీని పోలి ఉండదు. కొద్దిగా నవ్వుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్‌గా ఉంది. థమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ట్రై యువర్ లక్. అంటూ తన రివ్యూలో పేర్కొన్నారు కత్తి మహేష్.

‘రంగస్థలం’పై కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 03/30/2018 - 12:37

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ రంగస్థలం. ప్రపంచవ్యాప్తంగా 17వందల థియేటర్లలో విడుదలైంది. మూడు గంటల నిడివితో వచ్చిన రంగస్థలం...ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా సూపర్‌ హిట్‌ అంటూ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యాన్ని సుకుమార్‌ కళ్లకు కట్టినట్లు బాగా చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా గురించి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
 

పవన్‌ను ‘నోరు తెరిస్తే అజ్ఞానం’ అంటూ కత్తి సంచలన ట్వీట్

Submitted by arun on Wed, 03/28/2018 - 17:07

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా పవన్‌ను నోరు తెరిస్తే అజ్ఞానమేనంటూ మహేష్ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. ‘‘బాబు పవన్ కల్యాణ్! రాజ్యంగ సంక్షోభం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన ఎడల, ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసి సుఖీభవ!’’ అంటూ మహేష్ సంచలన ట్వీట్ చేశారు.

జ‌న‌సేన‌కు దిలీప్ సుంక‌ర గుడ్ బై..?

Submitted by lakshman on Tue, 03/27/2018 - 20:13

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌గా, ఆ పార్టీ అధినేత త‌రుపున సంద‌ర్భానుసారం వాదించే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర. అయితే ఆ క‌ల్యాణ్ దిలీప్ జ‌న‌సేన పార్టీకి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌న‌సేన క్రియాశీల‌క కార్య‌క‌ర్తే కాకుండా ప‌వ‌న్ అభిమానం సంఘం నాయ‌కుడు కూడా. 

చంద్ర‌బాబు కంట‌త‌డిపై క‌త్తిమ‌హేష్ సెటైర్లు

Submitted by lakshman on Wed, 03/14/2018 - 03:36


ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.  ఈ సెష‌న్స్ లో మాట్లాడిన చంద్ర‌బాబు భావోద్వేగంతో క‌న్నీరుపెట్టుకున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌ల‌తో కేంద్రంపై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన చంద్ర‌బాబు.  నాడు రాష్ట్ర‌విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామ‌ని పీఎం మోడీ తెలిపార‌ని అన్నారు.  కానీ ఇప్పుడు మాత్రం అమ‌రావతి నిర్మాణ కోసం స‌హ‌క‌రించాలని కేంద్రాన్ని కోరుతుంటే ..బీజేపీ నేత‌లు మాత్రం డ్రీమ్ సిటీ అని హేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అన్నారు.

కామినేని రాజీనామాపై కత్తి సంచలన ట్వీట్

Submitted by arun on Sat, 03/10/2018 - 11:12

అధిష్టానం ఆదేశాలతో ఏపీ కేబినెట్‌లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.