Mahesh Kathi

కత్తి మహేష్ పై పరువు నష్టం దావా వేస్తాం

Submitted by arun on Mon, 01/08/2018 - 15:22

పవన్ కల్యాణ్, కత్తి మహేష్ మధ్య మొదలైన వివాదం ఓ మలుపు తీసుకుని... పూనం కౌర్, కత్తి మహేష్ మధ్య రాజుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా, కత్తి మహేష్ ను ఫ్యాట్సో, బెగ్గర్ అని వ్యాఖ్యానిస్తూ పూనం కౌర్ ట్వీట్ చేయడంతో గొడవ పెద్దదైపోయింది. ఈ నేపథ్యంలో పూనం కౌర్ కు ఇవే తన ప్రశ్నలంటూ ఓ ఆరింటిని కత్తి మహేష్ సంధించారు. వీటికి పూనం కౌర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

క‌త్తికి మ‌ద్ద‌తుగా పూనమ్ ట్వీట్‌!

Submitted by arun on Mon, 01/08/2018 - 13:29

పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ కత్తి విసిరిన సవాలుతో.. వివాదం క్లైమాక్స్‌కు చేరుకుందనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా వివాదం మరో మెట్టు ఎక్కింది. కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ క‌త్తి మ‌హేష్‌కు, ఆయ‌న త‌ల్లికి మ‌ద్ద‌తుగా పూన‌మ్ ఓ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదివారం జ‌రిగిన ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ వివేక్.. క‌త్తి మ‌హేష్ త‌ల్లి గురించి ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాడు.

పూన‌మ్ కౌర్ కాదు ..కొంత‌మంది హీరోయిన్లు కూడా : క‌త్తి

Submitted by arun on Mon, 01/08/2018 - 11:51

తొండ‌ముదిరి ఊస‌ర‌వెల్లి అన్న చందంగా క్రిటిక్ క‌త్త‌మ‌హేష్ - పవ‌న్ క‌ల్యాణ్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పాలిటిక్స్ నుంచి వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి చేరింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ - హీరోయిన్ పూనమ్ కౌర్ కు మ‌ధ్య ఉన్న సంబంధాల గురించి ప్ర‌స్తావించ‌డ‌మే ఆస‌క్తిక‌రంగా ఉంది. అంతేకాదు ఆ ఆరు ప్ర‌శ్న‌లు పూన‌మ్ కౌర్ కు ప్ర‌శ్నించిన మ‌హేష్ ..మ‌రో ఐదారుగురు హీరోయిన్లు కూడా ఉన్నార‌ని వారి గురించి త్వ‌ర‌లో మీడియాకు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్‌ను కాపాడలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు కత్తి మహేష్.

క‌త్తి మ‌హేష్ ప్రెస్ మీట్ పై కోన్ వెంక‌ట్ ట్వీట్

Submitted by arun on Mon, 01/08/2018 - 11:17

ప‌వ‌న్ కల్యాణ్ - క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య వివాదం తారాస్థాయికి చేరింది. నిన్న‌ ప్రెస్ మీట్ లో క‌త్తి మ‌హేష్..పూన‌మ్ కౌర్, కోన వెంక‌ట్ , త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఇన్నాళ్లు పవన్ స్పందిస్తే చాలు అనుకున్న ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని అంటున్నారు. అయితే ప్రెస్ మీట్ అనంత‌రం ప‌లు ఛాన‌ళ్ల‌లో లైవ్ డిస్క‌ష‌న్స్ లో పాల్గొన్నారు. లైవ్ డిస్క‌ష‌న్స్ లో కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు - మ‌హేష్ క‌త్తి ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కోన వెంక‌ట్ స‌యోధ్య కుదుర్చుతాన‌ని ట్వీట్ చేశారు.

కత్తి మహేష్ పై చ‌ర్య‌లు తీసుకుంటాం : టాప్ క‌మెడియ‌న్

Submitted by arun on Sun, 01/07/2018 - 21:36

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పై క‌మెడియ‌న్ వేణుమాద‌వ్ సెటైర్లు వేశారు. ఆదివారం ఉద‌యం సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో మాట్లాడిన  మ‌హేష్. ప‌వ‌న్ క‌ల్యాణ్, హీరోయిన్ పూన‌మ్ కౌర్ గురించి ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ అనంత‌రం ఓ లైవ్ షోలో పాల్గొన్న మ‌హేష్ కు చుర‌క‌లంటించారు వేణుమాధ‌వ్. ఓ  ఛాన‌ల్ నిర్వ‌హించిన లైవ్ షోలో ఫోన్లో మాట్లాడిన వేణుమాధ‌వ్  తాను పెద్ద‌వాళ్ల‌తో, అంకుల్స్ తో మాట్లాడ‌నంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు లైవ్ లో ప‌వ‌న్ అభిమానులు మాట్లాడ‌వ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చారు.

ప‌వ‌న్ కోసం పూనం తిట్ల‌దండ‌కం

Submitted by arun on Sat, 01/06/2018 - 15:37

నిన్న‌టి వ‌ర‌కు క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు మ‌హేష్ తీరుపై ఎండ‌గ‌డుతు ఇండ‌స్ట్రీ నుంచి విమ‌ర్శ‌లు ఎద‌రువుతున్నాయి. రైట‌ర్ కోన వెంక‌ట్..క‌త్తిమ‌హేష్ ను ఉద్దేశిస్తూ ప‌రోక్షంగా అత‌నో జోక‌ర్ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్విట్ పై స్పందించిన క్రిటిక్ ఘాటుగానే రిప్లైయి ఇచ్చాడు. తాజాగా ప‌వ‌న్ వీరాభిమాని అయిన హీరోయిన్ పూనం కౌర్ సద‌రు క్రిటిక్ ను ఉద్దేశించి తిట్ల‌దండ‌కం అందుకోవం విశేషం.

పందితో పోల్చడంపై కత్తి మహేశ్ ఏమన్నాడంటే...

Submitted by arun on Fri, 01/05/2018 - 13:42

పవన్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడుతున్న కత్తి మహేశ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అతనిని విమర్శిస్తూ పేజ్‌లు, ఫొటోలు సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి. పందితో కత్తి మహేశ్‌ను పోల్చుతూ మెమ్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్‌బుక్‌ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్‌ ఆఫీసులోనే క్రియేట్‌ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్‌ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి. తిట్టమని కోరుతూ పవన్‌ అభిమానులకు నా ఫోన్‌ నంబర్‌ షేర్‌ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక బ్రోకర్ - మ‌హేష్ క‌త్తి

Submitted by arun on Wed, 01/03/2018 - 21:12

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క్రిటిక్ మహేశ్ కత్తి మండిప‌డ్డారు. ఓ మీడియా డిబెట్ లో పాల్గొన్న మ‌హేష్ క‌త్తి.. పవన్‌ ఒక రాజకీయ జోకర్, పవర్ బ్రోకర్ అంటూ విమ‌ర్శించాడు.  అంతేకాదు ప‌వ‌న్ కు దైర్యం ఉంటే పవన్‌కు ధైర్యముంటే  అన్నీ స్థానాల్లో పోటీ చేయాల‌ని సూచించారు. తాను రాజ‌కీయాల్లో వ‌స్తున్నాన‌ని ప్ర‌కటించిన ర‌జ‌నికాంత్...త‌మిళ‌నాడు అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ర‌జనీ ఎలా ప్ర‌క‌టించారో ..జ‌న‌సేనాని అలాగే ప్ర‌క‌టించాల‌ని స‌వాల్ విసిరారు. 

సీఎం కేసీఆర్‌ను ప‌వ‌న్ అందుకే క‌లిశాడు: క‌త్తి మ‌హేష్‌

Submitted by arun on Tue, 01/02/2018 - 11:37

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడంపై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. వరుస పోస్టులతో విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ‘ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా’ అని ప్రశ్నించారు. అలాగే `అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్ షోస్ ఎన్ని ప‌డ‌తాయో చెప్పు బ్ర‌ద‌ర్ ఆఫ్ మెగాస్టార్‌` అని మ‌రో కామెంట్ చేశాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు క‌త్తి వ్యాఖ్య‌ల‌పై విరుచుకుపడుతున్నారు.