Jammu Kashmir

కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు

Submitted by arun on Sat, 07/14/2018 - 13:12

‘ కట్టుకున్న భార్యను నేను వుండగానే ఆయన కాలేజీ చదువుతున్న 19 ఏళ్ళ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమెను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు’ అంటూ ఓ ఎమ్మెల్యే భార్య జమ్మూ కాశ్మీర్‌లో తన భర్త యవ్వారాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ రచ్చకీడ్చింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు జీజేపీ ఆర్ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్. ఆమె పేరు మోనికా శర్మ. జమ్మూ బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా మోనిక అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘‘నేను మీ కుటుంబంలోని కుమార్తెగా భావించి న్యాయం కోసం అభ్యర్థిస్తున్నా.

కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన ఉగ్రవాదులు!

Submitted by arun on Fri, 07/06/2018 - 10:22

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. సోఫియాన్‌ జిల్లాలోని ఖచ్‌దోరాలో కానిస్టేబుల్‌ జావేద్‌ అహ్మద్‌ దార్‌ను కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్య చేశారు. కానిస్టేబుల్‌ను నిన్న కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు... చంపేసి గ్రామ శివార్లలో శవాన్ని పడేసి వెళ్లారు.‎ దారుణంగా హింసించి ... కాల్చి చంపారు. శరీరాన్ని బులెట్లతో చీల్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... పోస్ట్‌‌మార్టం అనంతరం గౌరవ వందనం సమర్పించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పంగించారు.

మాయమాటలతో రూ.200కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్

Submitted by lakshman on Tue, 12/19/2017 - 15:42

15ఏళ్లకే మిస్ జమ్మూ కాశ్మీర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనారా గుప్త బోజ్ పురీ సినిమాలు, సీరియల్స్ లో బాగా ఫేమస్. 15ఏళ్ల మిస్ జమ్మూ కాశ్మీర్ అవ్వడంతో అవకాశాలు బాగానే వచ్చాయి. ఓపక్క అవకాశాలు మరోపక్క పాపులారిటి సంపాదించింది. ఆ పాపులారిటీనే పెట్టుబడిగా పెట్టి కోట్లు కొల్లగొట్టింది. ఇలా వందలు కాదు వేలు కాదు ఏకంగా మాయమాటలు చెప్పి రూ.200కోట్లు కొల్లగొట్టినట్లు లక్నో పోలీసులు చెబుతున్నారు. సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తామంటూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. అయితే డబ్బుకట్టిన బాధితులు అవకాశాల కోసం తిరగగా ఆమె మోసం చేసిందనే విషయం బట్టబయలైంది.