Mp Kavitha

జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన ఎంపీ కవిత

Submitted by arun on Tue, 09/04/2018 - 16:14

నిజామాబాద్‌ ఎంపీ కవిత జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎవరో దాదాపు చెప్పేశారు. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అభ్యర్ధిని ప్రకటించేశారు. జగిత్యాలకు కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ అంటూ కవిత అనౌన్స్ చేశారు. ప్రజలు ఆయనకు అండగా నిలవాలని కోరారు. కాబోయే ఎమ్మెల్యే సంజయ్ అంటూ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఇక ఎప్పటిలాగానే కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డ కవిత గొర్రెల పంపిణీని ఎగతాళి చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తలసాని ఫైర్ అయ్యారు. ఆయనవి గాలి మాటలేనని విమర్శించారు.

Tags

కేటీఆర్ కు సభలో షాకిచ్చిన కవిత

Submitted by arun on Wed, 08/01/2018 - 16:58

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత నిజామాబాద్ కలెక్టరేట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంపీ కవిత పాల్గొని అన్న కేటీఆర్‌కు కొన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్ కే పరిమితమైందని ఇప్పుడు అన్ని జిల్లాలకు ఐటీ విస్తరిస్తున్నారని అన్నారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు.

అందుకే నిజామాబాద్ కు దూరమవుతున్నారా.. ?

Submitted by arun on Tue, 07/24/2018 - 11:04

నిజామాబాద్ ఎంపీ సీటు పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలా ఉన్న ఆ నియోజక వర్గం 2014 తర్వాత టిఆరెస్ చేతిలోకి వెళ్లిపోయింది. మారుతున్న సమీకరణల్లో కాంగ్రెస్ నేత మధుయాష్కీ అదే నియోజక వర్గంనుంచి పోటీ చేస్తారా? లేక మారతారా? బిజెపి పోటీ లోకి దిగితే ఎలా ఉంటుంది?

కవిత కారులో జీవన్‌రెడ్డి....రాజకీయంగా చర్చనీయాంశం

Submitted by arun on Tue, 07/03/2018 - 10:36

సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి అన్ని పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి ఈటలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు సైతం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వస్తుండటం చూసి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుడుతున్నదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎప్పు డూ పార్టీలు, వ్యక్తులకు ప్రాధాన్యమివ్వరని, అభివృద్ధి, సం క్షేమం ఎజెండాగా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

నిజామాబాద్ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరుగుతోందా ?

Submitted by arun on Thu, 06/28/2018 - 11:53

నిజామాబాద్ రాజకీయాల్లో ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరిందా ? కారు పార్టీ కోరి తెచ్చుకున్న  సీనియర్ నేత డీఎస్‌కు పొమ్మనలేక పొగబెడుతోందా ?  అధిష్టానంపై అసంతృప్తితోనే డీఎస్ సొంత గూటికి చేరుకోవాలని భావిస్తున్నారా ? నిజామాబాద్ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరుగుతోందా ? ఇందురులో హాట్‌హాట్‌గా సాగుతున్న పాలిటిక్స్‌లో డీఎస్‌ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి ?       

ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుంది

Submitted by arun on Wed, 06/27/2018 - 14:18

నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. డీఎస్‌పై కవిత చేసిన ఆరోపణలు.. ఆమె రాజకీయ అపరిపక్వతను సూచిస్తోందని.. అన్నారు. ఆరోపణలు వింటేనే నవ్వొస్తొందని.. కుమారుడిపై కోపంతో.. తండ్రి పై చర్యలు తీసుకోవం హాస్యాస్పదం అన్నారు.  ‘టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆమె చేయలేదు.

కేసీఆర్‌ వ్యాఖ్యల్లో పొరపాటు దొర్లింది: కవిత

Submitted by arun on Fri, 03/02/2018 - 16:07

ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ఎంపీ కవిత. కేవలం మాట దొర్లడం వల్ల జరిగిన తప్పిదం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అంతేగానీ ప్రధానిని అవమానపర్చాలన్న ఉద్దేశం తమకు లేదని ఆమె చెప్పారు. చిన్న పొరపాటు దొర్లినందుకు బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కవిత విమర్శించారు. రైతుల కష్టాల పట్ల ఆవేదనతోనే కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు. ఐనా రైతు బడ్జెట్ అని చెప్పి కేంద్రం రైతులకు కేటాయించిందేమీ లేదని కవిత అన్నారు. 

‘చెల్లెలు కవిత గారికి థాంక్యూ’: పవన్‌కల్యాణ్‌

Submitted by arun on Sat, 02/10/2018 - 10:40

టీఆర్ఎస్ ఎంపీ కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన గళమెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా దీని గురించి లోక్‌సభలో మాట్లాడారు. ఆంధ్రాకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉండగా హామీల విషయంపై కేంద్రం మళ్లీ పాతమాటే చెబుతుండటంతో ఆంధ్రా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు: ఎంపీ కవిత

Submitted by arun on Thu, 02/08/2018 - 17:54

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్‌‌లో మాట్లాడిన ఆమె..ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఏపీ కోసం టీడీపీ ఎంపీల డిమాండ్‌లో న్యాయముందన్నారు. అయితే, ప్రభుత్వంలో ఉండి నిరసనలు తెలుపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.