election commission

ఓట‌రు లిస్టులో సన్నీ లియోన్, పావురం, ఏనుగు ఫోటోలు

Submitted by arun on Sat, 08/25/2018 - 11:24

ఉత్తరప్రదేశ్ ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లాయి. బాలియా జిల్లాలో ఓటర్ లిస్టును అప్‌డేట్ చేసిన తర్వాత ఓ గమ్మత్తు జరిగింది. స్థానిక ఓటర్ల పేర్లతో ఉన్న లిస్టులో.. ఫోటోలు వేరుగా ఉన్నాయి. ఫిల్మ్ హీరోయిన్ సన్నీ లియోన్, పావురాలు, జింకలు, ఏనుగులు కూడా... స్థానికుల ఓటర్ల లిస్టులో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పట్టణంలో పనిచేస్తున్న ఓ ఆపరేటర్ గ్రామీణ ప్రాంతానికి విధుల నిర్వహణ సందర్భంగా ఈ నిర్వాకం వెలగబెట్టాడని తెలిపారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జాబితాను సవరిస్తున్నట్లు పేర్కొన్నారు.

సర్పంచ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

Submitted by arun on Tue, 06/19/2018 - 10:34

పంచాయతీ ఎన్నికల్లో పోటీ అభ్యర్థుల వ్యయ పరిమితిని....తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచింది. పంచాయతీ జనాభా 5 వేల కంటే ఎక్కువుంటే...ఒక్కో అభ్యర్థి రెండున్నర లక్షలు, వార్డు అభ్యర్థి 50 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో పంచాయతీ విధానాల్లో ఎన్నికల సంఘం పలు మార్పులు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు నిబంధనలను నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.

నాగంకు గాలం వేయనున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం

Submitted by arun on Fri, 02/23/2018 - 11:10

తెలంగాణ రాజకీయ బరిలోకి మరో కొత్త పార్టీ వస్తోంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీ పనులు ఢిల్లీలో వేగంగా సాగుతున్నాయి. జాక్ చైర్మన్ ప్రొ. కోదండరాం కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర తన అనుచరుల ద్వారా పార్టీ నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈసీ ముందు మూడు పేర్లు, పార్టీ గుర్తు ఉంచినట్టు తెలిసింది. 

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఈసీకి రేవంత్‌ ఫిర్యాదు

Submitted by arun on Tue, 01/23/2018 - 15:46

తొమ్మిది మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేల తరహాలో లాభదాయక పదువుల్లో ఉన్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారని, మరో ముగ్గురు లాభదాయక పదవుల్లో ఉన్నారని లేఖలో ఆరోపించారు. వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించారని శ్రీనివాస్ గౌడ్, సతీష్ కుమార్‌లను డిప్యూటీ సీఎం కార్యాలయాల్లో సెక్రటరీలుగా నియమించారని చెప్పారు.

ఒక్కో ఓటు ఖరీదు రూ.10వేల నుంచి 6వేల వరకు

Submitted by lakshman on Tue, 12/19/2017 - 14:49

తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గంలో బైఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం వివిధ పార్టీల అభ్యర్ధులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నోట్లకట్టలను వెదజల్లుతున్నట్లు తెలుస్తోంది. మెరీనా బీచ్‌ స్టేషన్‌, అన్నా మెమోరియల్‌, కన్నగి విగ్రహం వద్ద  ఒక్కో ఓటరుకు రూ.10వేలు, రూ.6000, రూ.5000 ఇస్తునట్లు ఈసీ అధికారులు గుర్తించారు. ఇక కాశిమేడులో ఒక్కో ఓటరుకు రూ.10వేలు, రూ.6వేలు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్కేనగర్ లో గెలిచేందుకు రూ.100కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నట్లు డీఎంకే ఆరోపిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా డీఎంకే నేత స్టాలిన్‌ ఫిర్యాదు చేశారు.