Kurnool

మహిళతో అడ్డంగా దొరికిపోయిన కర్నూలు డీఎఫ్‌ఓ

Submitted by arun on Tue, 01/23/2018 - 11:38

కర్నూలు డీఎఫ్‌వో వెంకటేశ్వర్రావు రాసలీలలు చేస్తూ దొరికిపోయారు. అటవీశాఖ నిఘా విభాగం అధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్రావు ఓ యువతితో ఉండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌‌స్టేషన్‌కి తరలించారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని డీఎఫ్‌ఓతో పాటు అతనితో ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నగర శివారులోని ఓ గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు అక్కడకు వెళ్లి దాడి చేశాయి.

కుర్చీల కోసం కోట్లాడుకుంటున్న తెలుగు త‌మ్ముళ్లు

Submitted by arun on Sat, 01/13/2018 - 11:22

కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తమ ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు ఎస్వీ, టీజీ భరత్ లకే పరిమితమైన మాటల యుద్ధంలోకి టీజీ ఎంటరయ్యారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదని జన్మభూమి ముగింపు వేదికపై ఎస్వీకి టీజీ కౌంటర్ వేశారు. 

కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

Submitted by arun on Thu, 01/11/2018 - 13:20

వైసీపీ అధినేత జగన్‌ దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు సై అంటూ కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్‌ను ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి బుధవారం ప్రకటించారు. నగరంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు తమ నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో నియోజకవర్గంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని వైఎస్‌ జగన్‌ సూచించినట్లు తెలిపారు.

కర్నూలు టీడీపీలో వివాదం.. ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన డిన్నర్ పార్టీ ?

Submitted by arun on Sat, 12/30/2017 - 11:52

మంత్రి అఖిలప్రియ, అధికారపార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య తాజా వివాదానికి, బలాబలాల ప్రదర్శనకు ఈ నెల 31న ఏర్పాటు చేసిన డిన్నర్‌ వేదికగా మారింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఆ రోజున ఏవీ సుబ్బారెడ్డి డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలకు స్వయంగా ఆహ్వానం పలికారు. 

పార్టీ మారే విషయంపై బైరెడ్డి క్లారిటీ

Submitted by arun on Fri, 12/29/2017 - 16:15

సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరుతానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. నిన్న అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును బైరెడ్డి కలిశారు. అనంత‌రం బైరెడ్డి రాజశేఖ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరిక అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని, కానీ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని బైరెడ్డి స్ప‌ష్టం చేశారు. సంక్రాంతి పండుగ త‌ర్వాత ముహూర్తం చూసుకుని టీడీపీ పార్టీలో చేర‌తాన‌న్నారు. రాయ‌ల‌సీమ నీటి ప్రాజెక్టుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని కోరాన‌ని, దీనికి సీఎం చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించార‌ని బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తెలిపారు.

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

Submitted by arun on Fri, 12/29/2017 - 12:48

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్  ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల పర్వానికి ముందే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పోటీ నుంచి వైదొలిగింది.  బీఎస్పీ అభ్యర్థి దండు శేషు యాదవ్ నామినేషన్ ను తిరస్కరించారు.  స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పులి జయప్రకాష్ రెడ్డి ఇవాళ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అటు  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి నాగిరెడ్డి తన నామినేషన్ కు ఉపసంహరించుకున్నారు. దీంతో కేఈ ప్రభాకర్  ఏకగ్రీవ ఎన్నికకు  లైన్ క్లియర్ అయింది. 


 

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌

Submitted by arun on Tue, 12/26/2017 - 09:59

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయ్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది వైసీపీ. ఇంతలోనే వైసీపీ నేతలు నిర్ణయం మార్చుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి  రెడీ అయ్యారు. పార్టీ అధినేత జగన్ ఒప్పుకుంటే వైసీపీ తరపున, అంగీకరించకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు గౌరు వెంకట్ రెడ్డి. 

కర్నూలు టీడీపీ నేతలతో బాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక గురించి చర్చ

Submitted by arun on Sun, 12/24/2017 - 14:36

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కర్నూలు జిల్లా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక గురించి చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి గత నంద్యాల ఉప ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో ఇప్పటికే ఓ దఫా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇంచార్జి మంత్రి తదితరులు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని వదినను హత్య చేసిన ఆడపడుచు

Submitted by arun on Fri, 12/22/2017 - 13:09

వివాహేతర సంబంధానికి అడ్డు పడుతుందని వదినను ఆడపడుచు తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్‌  జిల్లా గోవిందపల్లెలో గత ఆదివారం జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో డీఎస్పీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన గంగదాసరి బాల నరసింహారెడ్డితో 15 ఏళ్ల క్రితం ఇందిరమ్మకు వివాహమైంది. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె 12 ఏళ్లుగా పుట్టింటిలో తల్లి చిన్న లక్ష్మమ్మ, అన్న వెంకటేశ్వరరెడ్డి, వదిన సునీతతో కలిసి ఉండేది. 

కోటలో కొనసాగుతున్న వేట

Submitted by arun on Tue, 12/19/2017 - 14:44

కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరుపుతున్న తవ్వకాల తీరుతో అందరి దృష్టి తవ్వకాలపైనే పడింది. చారిత్రక, ప్రాచీన కట్టడాలను కాపాడాల్సిన అధికారులు పోలీసులే గుప్త నిధుల కోసం రహస్య తవ్వకాలకు వత్తాసు పలికి అండగా నిలపడడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవతోంది. విజయనగర రాజుల కాలంలో కట్టిన కోటలో పెద్ద పెద్ద మందు పాతరలతో రాతిగుండ్లను బద్దలు కొడుతూ తవ్వకాలు జరుపుతున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.