Kurnool

కర్నూలు జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

Submitted by arun on Thu, 11/08/2018 - 10:44

కర్నూలు జిల్లా కల్లూరులో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. ఓ ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన డీలర్లు అంతా కలిసి ఓ ఫంక్షన్ హాల్‌‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేశారు. ఆ సందర్భంగా మద్యం మత్తులో డ్యాన్సర్లతో ఏజెంట్లు ఘర్షణకు దిగారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో మరో ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన డీలర్లు కూడా రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

దారుణం...విద్యార్ధిని గొంతు కోసిన హిందీపండిట్‌

Submitted by arun on Sat, 11/03/2018 - 11:56

కర్నూలులో దారుణం జరిగింది. బంగారుపేటలో బాలికపై ప్రేమోన్మాది దాడి చేశాడు. రాక్‌వుడ్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోన్న విద్యార్ధినిపై అదే పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న శంకర్ దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం తాను కూడా కత్తితో గొంతు కోసుకున్నాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు శంకర్‌‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్ధినిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు శంకర్‌ కూడా గొంతు కోసుకోవడంతో అతడ్ని కూడా హాస్పిటల్‌కి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో మిస్టరీ మంటలు...భూమి చీలి పోయి...

Submitted by arun on Sat, 10/13/2018 - 13:51

కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమి చీలి పోయి పొరల్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వెలువడుతున్నాయి. ఆశ్చర్యం కలిగించే ఈ  వింతను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.  మంటల ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Tags

కర్నూలు జిల్లాలో మరో మనోహరాచారి...ప్రేమలో పడిందని కూతురిపై...

Submitted by arun on Sat, 10/06/2018 - 10:48

పరువు ముందు ప్రేమ మరోసారి ఓడిపోయింది. మొన్న మిర్యాలగూడ, నిన్న ఎర్రగడ్డ ఇవాళ ఆదోని. ప్రేమించిన పాపానికి ఆడబిడ్డలు బలైపోతున్నారు. కన్నకూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న తండ్రి ఆమెపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. కసిదీరా కత్తితో గొంతు కోశాడు. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కలకలం రేపుతోంది. 

Tags

భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య..

Submitted by arun on Sat, 09/08/2018 - 13:07

అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను దారుణంగా హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. ఘటన విషయంలోకి వస్తే కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం బోయినపల్లికి చెందిన లక్ష్మీదేవి శివరాముడు దంపతులు.. వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్మిదేవి అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో గత 7 ఏళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచుగా గొడవపడుతుండే వారు. అయితే 20 రోజుల క్రితం కూతురు పెళ్లి చేశారు. గురువారం నూతన దంపతులు ఇంటికి వచ్చారు. కూతురు అల్లుడు ముందే వివాహేతర సంబంధం విషయంలో భర్త శివరాములుకు లక్ష్మీదేవికి మధ్య గొడవ జరిగింది.

ఎమ్మెల్యే తండ్రికి టోకరా.. 50 లక్షలతో ఉడాయించిన డ్రైవర్!

Submitted by arun on Thu, 08/16/2018 - 09:09

ఎమ్మెల్యే తండ్రికి టోకరా వేసి ఓ కారు డ్రైవర్ అతడి వద్ద ఉన్న రూ.50 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తుండగా చోటుచేసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్‌ రూ.50 లక్షలతో పారిపోయాడు. రామకృష్ణారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేసే మల్లికార్జున కారులో ఉన్న 50లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. దీంతో చోరీ ఘటనపై రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

క్వారీలో భారీ పేలుడు...11 మంది కూలీలు మృతి

Submitted by arun on Sat, 08/04/2018 - 10:29

క్వారీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన 11 మంది కూలీలకు సమాధి కట్టాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారంతా అగ్ని కీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ వద్ద క్వారీలో రాత్రి ఉన్నట్టుండి భారీ పేలుళ్లు జరిగాయి. వెనువెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. మరో ఐదుగురు కూలీలు అగ్నికీలల్లో చిక్కుకుని సగం శరీరం కాలిపోయి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

లోకేష్ ప్రకటనపై తీవ్ర అసంతృప్తిలో తండ్రీ కొడుకులు...ఇతర పార్టీలవైపు చూపు

Submitted by arun on Thu, 07/12/2018 - 14:58

పార్టీలో ఉన్న వారిని కాదని ఫిరాయింపు నేతలకు చినబాబు పెద్ద పీట వేయడంపై టీడీపీలో రచ్చ జరుగుతోంది. నాలుగేళ్లు కష్టపడి అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్న  టిజి కుటుంబం చినబాబు తీరుపై మండి పడుతోంది. బట్  పైకి ఏమాత్రం తేలకుండా లోపల వారి ప్రయత్నాల్లో వారున్నారు.

Tags

లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదు : టీజీ వెంకటేష్‌

Submitted by arun on Wed, 07/11/2018 - 13:27

మంత్రి నారా లోకేష్ పై టీజీ వెంకటేష్  ఫైరయ్యారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంపై సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. లోకేష్  పార్టీ అధ్యక్షుడు కాదని అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తే అప్పుడు స్పందిస్తానన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లోకేష్ ను హిప్నాటైజ్ చేసినట్టు ఉందని, అభ్యర్థుల ప్రకటన తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని టీజీ వెంకటేష్  అన్నారు. 

ఈనెల 7న జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న సిద్ధార్ధ్‌ రెడ్డి

Submitted by arun on Fri, 07/06/2018 - 14:20

ఇటీవల కాలంలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు సిద్ధార్ధ్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదిన వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.