bitcoin

మార్కెట్లోకి రానున్న‌ జియో బిట్ కాయిన్

Submitted by lakshman on Sun, 01/14/2018 - 21:36

టెలికాం రంగంలో దిగ్గ‌జాల‌ను మ‌ట్టిక‌రిపించిన రిల‌య‌న్స్  జియో గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 

బిట్ కాయిన్‌ మన అకౌంట్లలోకి ఎలా వస్తుందంటే

Submitted by lakshman on Tue, 12/19/2017 - 22:35

రిపిల్‌. దీన్ని 2012 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది బ్యాంకులు, పేమెంట్స్‌ ప్రొవైడర్లు, డిజిటల్‌ అసెట్‌ ఎక్స్ఛేంజీలు, కార్పొరేట్లను అనుసంధానం చేస్తుంది. దీన్ని బిట్‌కాయిన్‌ డెవలపర్లు రూపొందించారు. ఎక్స్‌ఆర్‌పి అనేది రిపిల్‌ క్రిప్టోకరెన్సీ. బిట్‌కాయిన్‌ విలువ పెరుగుతున్నప్పటి నుంచి దీని విలువ కూడా పెరుగుతోంది. ఇథేరియం. ఇది బిట్‌కాయిన్‌కు టఫ్‌ కాంపిటీషన్ ఇస్తోంది. 2014 సంవత్సరంలో ఇది అందుబాటులోకి వచ్చింది.
జడ్‌క్యాష్‌...ఇది కూడా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఆవిర్భవించినదే. 2016 అక్టోబరులో జడ్‌క్యాష్‌ ప్రారంభమైంది. 

బిట్ కాయిన్ ని ఎలా కొనుగోలు చేయాలంటే

Submitted by lakshman on Tue, 12/19/2017 - 22:27

బిట్ కాయిన్ ఆధునిక కాలపు కరెన్సీ.  దీనిని అంతర్జాతీయంగా ఎక్కడైనా మార్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో మొత్తంగా ఇదే ఉపయోగ పడుతుంది. ఇది ఊహా ధనం అనవచ్చు. లేదా కనిపించని ధనం. కానీ ఇది అన్ని దేశాల కరెన్సీ లతో మారుబడి అవుతుంది. ఏదేశంలో నైనా చెల్లుబాటు అవుతుంది. ఇది ఇంటర్నెట్ ద్వారా మార్చుకోవచ్చు. లేదా ఫోన్ ద్వారా నైనా మార్చుకోవచ్చు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొనుగోలు చేయ వచ్చు.

బిట్ కాయిన్ ఎవరు తయారు చేశారో తెలుసా

Submitted by lakshman on Tue, 12/19/2017 - 22:20

మనం ఏదైనా వస్తువు కొనేందుకు డబ్బులు మన కరెన్సీలో డబ్బులు చెల్లిస్తాం. అమెరికాలో అయితే డాలరు. యూరోప్‌లో యూరో. ఇలా ఏ దేశం వారు ఆ దేశం కరెన్సీలో లావాదేవీలు సాగిస్తుంటారు. ఆన్‌లైన్‌లోనూ డెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగించి షాపింగ్ చేస్తాం. అంతేకాదు మన అకౌంట్‌లోని డబ్బులను ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేస్తాం. ఇవన్నీ చలామణిలో ఉన్నవే. కానీ ప్రపంచంలో సరికొత్త మారకం ఎప్పుడో తెరపైకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తన ఉనికిని విస్తృతం చేసుకుంటోంది. అదే బిట్ కాయిన్. 

2వందల కోట్ల కుంభకోణంలో వైసీపీ నేత

Submitted by arun on Tue, 12/19/2017 - 14:15

బిట్‌ కాయిన్‌ ఇటీవల కాలంలో ఈ పదం బాగా ప్రాచూర్యం పొందింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టి లక్షాధికారులు అవ్వొచ్చంటూ జనానికి కుచ్చు టోపి పెట్టేందుకు యత్నించాడు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం బల్లవరానికి చెందిన రామకృష్ణారెడ్డి కనిగిరిలో బిట్‌కాయిన్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నించారు. బిట్‌ కాయిన్ ఇండియా సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పేరుతో ఆఫీస్ నిర్వహించేందుకు ఓ బిల్డింగ్‌ను కూడా అద్దెకు తీసుకున్నాడు. కాల్‌సెంటర్‌లో సిబ్బంది నియామకాలకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు.