amit shah

తెలంగాణలో షా ఆపరేషన్‌...ప్రచారానికి 15 మంది సీఎంలు

Submitted by arun on Tue, 10/09/2018 - 09:59

దక్షిణాదిన తన ఉనిఖిని చాటేందుకు ఉవ్వీళ్లూరుతున్న బీజేపీ తెలంగాణను వేదికగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. రోజురోజుకూ మారుతున్న సమీకరణాల దృష్ట్యా.. తెలంగాణలో తమకున్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు కమలం పెద్దలు దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని కనిష్టంగా 15 సీట్లను ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన బాబుమోహన్‌!

Submitted by arun on Sat, 09/29/2018 - 17:54

టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన బాబుమోహన్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్ దక్కకపోవడంతో బాబుమోహన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

సీఎం కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌... అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:19

ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఉదయం 11 గంటలా 30 నిముషాలకు బేగంపేట్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు రాష్ట్రానికి చెందిన కాషాయ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

దూకుడు పెంచిన బీజేపీ...తెలంగాణకు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

Submitted by arun on Fri, 09/14/2018 - 13:06

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంపై దృష్టి సారించిన ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ నిర్వహించేందుకు అంగీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ...మొత్తం 119 స్థానాల్లో ...

Submitted by arun on Mon, 09/10/2018 - 11:39

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమైంది. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాలమూరులో నిర్వహించే బహిరంగ సభ తర్వాత తొలి విడతగా 50 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. అలాగే ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులను ప్రచారానికి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది.

ఎన్నికలొస్తాయి.. సిద్ధం కండీ: అమిత్‌ షా

Submitted by arun on Tue, 09/04/2018 - 13:32

ముందస్తు ఎన్నికలకు కాషాయ పార్టీ  రెడీ అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికలు వస్తాయంటూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 12 లేదా 15న మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఆ తర్వాత నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ నేతలతో కిషన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. 

జెండా ఆవిష్కరణలో అపశృతి

Submitted by arun on Thu, 08/16/2018 - 09:44

స్వాతంత్య్రదినోత్సవం రోజున న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అపశృతి చోటుచేసుకొన్నది. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా జాతీయజెండా ఆవిష్కరిస్తున్న సమయంలో పొరపాటున జెండా కిందికి జారింది. దీంతో వెంటనే తేరుకున్న షా.. జెండా తాడును వేగంగా లాగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. జెండా ఆవిష్కరణ అనంతరం షా జాతీయ జెండాకు కాకుండా మరోవైపు తిరిగి సెల్యూట్‌ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. జాతీయ పతాకం కిందకు పడిపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ..

దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి...మమతకు అమిత్ షా సవాల్

Submitted by arun on Thu, 08/02/2018 - 10:21

మమతా బెనర్జీ ప్రభుత్వం తనను బెదిరించలేదని, తాను కోల్‌కతా వెళ్లే తీరుతానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పోలీసులు తనను ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానని సవాలు విసిరారు. ఈ నెల 11‌న కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలని అమిత్ షా భావించారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్‌లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి.

డీఎస్ తనయుడితో భేటీ...డీఎస్ రాజకీయ భవిష్యత్తుపై చర్చ?

Submitted by arun on Tue, 07/17/2018 - 11:31

తెలంగాణలో ఒకరోజు పర్యటనలో బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా అసలెందుకొచ్చినట్లు? సీనియర్లను కాక కేవలం ఎంపిక చేసిన కొద్ది మందితో వ్యక్తిగత సమావేశాల వెనక ఎజెండా ఏంటి? హిందూత్వ ఎజెండా మోస్తున్న వారికే అమిత్ షా ప్రాధాన్యత ఇచ్చారా?