fidaa

అమ్మ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 17:19

'ఫిదా' చిత్రంలో తెలంగాణ పోరి భానుమతిగా ఆక‌ట్టుకుంది సాయిప‌ల్ల‌వి. నిజంగానే తెలంగాణ అమ్మాయేమో అనిపించింది ఆ సినిమాలో. అంతేకాదు.. త‌న‌కు ఇదే తొలి తెలుగు సినిమా అయినా, తెలుగు రాకున్నా డ‌బ్బింగ్ చెప్పుకుందీ కేర‌ళ‌కుట్టి. ప‌ర‌భాషా ముద్దుగుమ్మ‌లు డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డమే గొప్ప అయితే.. క్లిష్ట‌మైన తెలంగాణ స్లాంగ్‌లో డ‌బ్బింగ్ చెప్ప‌డం అన్న క్రెడిట్ సాయిప‌ల్ల‌వికే ద‌క్కింది.

సాయిప‌ల్ల‌వి హ‌వా

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 19:02

'ఫిదా' చిత్రంలో భానుమ‌తి పాత్ర‌లో జీవించేసింది సాయిప‌ల్ల‌వి. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో తెలుగునాట ఈ ముద్దుగుమ్మ‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ప‌ర్య‌వ‌సానంగా.. త‌మిళంలో, మ‌ల‌యాళంలో ఆమె చేసిన‌, చేస్తున్న సినిమాల‌ను తెలుగులో కూడా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ఇక్క‌డి నిర్మాత‌లు.  ఈ నాలుగు నెల‌ల్లో సాయి ప‌ల్ల‌వి న‌టించిన  మ‌రో మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

బాబాయ్ టైటిల్ అబ్బాయ్‌కి క‌లిసొస్తుందా?

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 18:52

'తొలిప్రేమ‌'.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్ర‌మిది. ప్రేమ‌క‌థా చిత్రాల‌లో కొత్త ట్రెండ్ సృష్టించిన ఈ సినిమా టైటిల్‌తో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. 'ఫిదా'తో త‌న కెరీర్‌లో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న మెగా హీరో వ‌రుణ్‌ తేజ్‌.. త‌న‌ తాజా చిత్రానికి, బాబాయ్ ప‌వ‌న్ న‌టించిన సినిమా టైటిల్‌ని పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌.  నాటి 'తొలిప్రేమ' చిత్రం ద్వారా క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైతే.. తాజా 'తొలిప్రేమ' చిత్రం ద్వారా వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

New films that capture the telangana essence

Submitted by admin on Sun, 09/10/2017 - 18:11

హైదరాబాద్‌ః తెలుగు సినిమాల్లో ఇన్నాళ్లు హీరోహీరోయిన్లు ఒకలా, విలన్లు, కమెడియన్లు మరోలా మాట్లాడేవారు. తెలంగాణ యాసను కేవలం విలన్లు, కమెడియన్లు మాత్రమే మాట్లాడతారేమోనన్న భ్రమ కలిగేలా ఒకప్పటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రోజులు మారాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణ యాసకు, తెలంగాణ చిత్రాలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి చిత్రాలకు లభించిన అపూర్వ స్పందనే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు శేఖర్ కమ్ముల చిత్రాలలో అడపాదడపా తెలంగాణ యాస హీరోల నోటి వెంట వినిపించేంది. పెళ్లి చూపులు సినిమా తర్వాత సీన్ మారింది.