narendra modi

కర్ణాటక సీఎంకు మోదీ సవాల్‌

Submitted by arun on Wed, 06/13/2018 - 11:14

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ఫిట్ నెస్ సవాలును స్వీకరించి... తాను ఎక్సర్ సైజ్ లు చేస్తున్న ఓ వీడియోను  పోస్టు చేశారు  ప్రధాని నరేంద్ర మోడీ. కర్ణాటక సీఎం  కుమారస్వామి తన ఫిట్ నెస్ చూపాలని సవాల్ విసిరారు. ఆయనతో పాటు కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ఐఏఎస్ అధికారులనూ చాలెంజ్ చేశారు. ఇక తన ఫిట్ నెస్ వీడియోలో పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంలతో మమేకమైతే ఎంతో ప్రేరణ పొందవచ్చని... ఆపై ఉత్సాహంగా రోజు సాగుతుందన్నారు  మోడీ. 

బీజేపీకి ఊహించని షాక్‌ ...తాజా సర్వేతో మోడీ, అమిత్ షాల్లో కలవరం

Submitted by arun on Mon, 06/11/2018 - 11:15

వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరాభవం తప్పదా ? నాలుగేళ్ల కమలదళం పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారా ? ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో గ్రాఫ్‌ పెరిగిందని బీజేపీ నేతలంటుంటే....సర్వేలు ఏం చెబుతున్నాయ్ ? 2014 ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ దళానికి ఓటర్లు షాకివ్వనున్నారా ? 150 సీట్లు కూడా గెల్చుకోలేని స్థితికి పార్టీ దిగజారిపోయిందా ? ఇటీవల నిర్వహించిన సర్వేలో ఏం తేలింది. 

రాజీవ్‌ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!

Submitted by arun on Fri, 06/08/2018 - 14:39

ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను పుణె పోలీసులు గుట్టురట్టు చేశారు. దీంతో వాళ్లకు మోడీ హత్య గురించి వేసిన ప్రణాళికలు తెలిశాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే.. ప్రధాని మోడీని కూడా టార్గెట్ చేయాలని మావోలు ఓ లేఖలో విశ్లేషించారు.

ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు పెట్టారు

Submitted by arun on Tue, 06/05/2018 - 14:33

ఏపీలో మోదీ ప్రేరేపిత రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. 2015లో రాజీ డ్రామాలు మొదలుపెట్టిన వైసీపీ ఎంపీలు ఇంకా కొనసాగిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు అన్ని పెట్టారంటూ శివ ప్రసాద్ వ్యాఖ్యానించారు.  సీఎం చంద్రబాబు జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతారని మోడీ భయపడుతున్నారంటూ శివ ప్రసాద్ ఎద్దేవా చేశారు.  

ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని మోడీ

Submitted by arun on Tue, 05/29/2018 - 12:40

ప్రధాని నరేంద్ర మోడీ నమో యాప్ ద్వారా ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. ముద్రా యోజన ద్వారా ప్రయోజనం పొందిన తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు తదితర బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులలో కొందరిని ఎంపిక చేసి ప్రధానితో మాట్లాడే అవకాశం కల్పించారు. వీరితో మాట్లాడిన అనంతరం ప్రధాని లబ్ధిదారులకు కొన్ని సూచలను చేశారు.

మోడీకి రాహుల్ గాంధీ ఫ్యూయల్ చాలెంజ్

Submitted by arun on Thu, 05/24/2018 - 16:10

ట్విట్టర్‌లో రాహుల్ వర్సెస్ ప్రధాని మోడీ అన్నట్లుగా కొనసాగుతోంది. లేటెస్ట్‌గా రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీకి ఫ్యూయల్ చాలెంజ్ విసిరారు. పెట్రోల్ రేట్లైనా తగ్గించండి.. లేకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలైనా ఎదుర్కోండి అని ట్వీట్ చేశారు. రాహుల్ ఫ్యూయల్ చాలెంజ్ పుట్టుకొచ్చేందుకు ఓ రీజన్ ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫిట్ నెస్ చాలెంజ్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీకి కోహ్లీ ఫిట్‌నెస్ చాలెంజ్ విసిరాడు. దానిని మోడీ స్వీకరిస్తున్నట్లు.. ట్వీట్ చేశారు. కోహ్లీ చాలెంజ్‌కు ప్రధాని ఓకే చెప్పడంతో.. రాహుల్ తన ఫ్యూయల్ చాలెంజ్‌ స్వీకరించాలని మోడీకి ట్వీట్ చేశారు.

కోహ్లీ సవాలును స్వీకరించిన మోదీ

Submitted by arun on Thu, 05/24/2018 - 11:25

‘హమ్ ఫిట్‌ తో ఇండియా ఫిట్’ పేరిట కేంద్రమంత్రి రాజ్య వర్థన్ సింగ్ చేసిన ఫిట్‌నెస్ చాలెంజ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించారు. వెంటనే తాను చేసిన ఓ వ్యాయామానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానితో పాటు ఈ ఛాలెంజ్‌‌ను స్వీకరించాల్సిందిగా తన భార్య, నటి అనుష్క శర్మకు, ప్రధాని నరేంద్ర మోదీకి, టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పేర్లను ట్యాగ్ చేశారు. అయితే కోహ్లీ సవాలుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విరాట్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలోనే తన వీడియో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు. మనం ఫిట్‌గా ఇండియా ఫిట్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. 

బాలయ్య ఇదేం హిందీ....అర్థాల కోసం వెతుకున్న మేధావులు

Submitted by arun on Sat, 04/21/2018 - 13:50

బావకళ్లల్లో ఆనందం చూడటానికి బాలయ్య రెచ్చిపోయాడు. వచ్చీరాని హిందీలో అడ్డంగా మాట్లాడేశాడు. సినీ డైలాగులు సొంత కవిత్వాన్ని వాడేస్తూ తనదైన శైలిలో ప్రసంగించాడు. ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడిన బాలయ్య హిందీ మాటలకు అర్థాలేంటి? హిందీ పండితులకు, ఉర్దూకు ఆలవాలమైన హైదరాబాదీ ముస్లింలు కూడా ఈ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.