narendra modi

కేరళలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే...తక్షణ సాయం కింద ఐదు వందల కోట్లు విడుదల

Submitted by arun on Sat, 08/18/2018 - 13:27

గడచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కకావికలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ  తక్షణ సాయం కింద రాష్ట్రానికి ఐదు వందల కోట్ల సాయాన్ని ప్రకటించారు.  దీంతో పాటు  వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు  50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని వెల్లడించారు.  రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అరగంట పాటు హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన వరద నష్టంపై  సమీక్ష  సమావేశం నిర్వహించారు.

బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్‌పేయి పార్థివదేహం...

Submitted by arun on Fri, 08/17/2018 - 11:38

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహనికి పార్టీ అగ్రనేతలు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు నివాళులర్పించారు. అటల్‌జీని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Submitted by arun on Thu, 08/16/2018 - 14:20

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయి పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటూ ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియడంతో మోదీ నిన్న రాత్రే ఎయిమ్స్ కు చేరుకుని ఆయన్ని పరామర్శించారు. సుమారు 50 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు.

ఆ ఏనుగుతో మోడీ అలా డాన్స్ చేయించగలుగుతారా...

Submitted by arun on Thu, 08/16/2018 - 09:28

పంద్రాగస్టు అనగానే ఎర్రకోట గుర్తుకొస్తుంది. ఎర్రకోట పై నుంచి ప్రధాని చేసే ప్రసంగం కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా అదే జరిగింది. కాకపోతే...రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగానికి  ప్రాధాన్యం పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగం పాత అంశాలను సృజించింది. కొత్త అంశాలను ప్రస్తావించింది. ప్రత్యక్షంగా పాలనాపరంగా, పరోక్షంగా పార్టీపరంగా చోటు చేసుకోబోయే మార్పులను వెల్లడించింది. మోడీ ప్రసంగం ప్రజలను ఆకట్టుకుందా ?  ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి ? బీజేపీ ధోరణిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోనుంది.

అత్యాచార నిందితులకు మరణ శిక్షే సరి : మోడీ

Submitted by arun on Wed, 08/15/2018 - 12:27

72వ స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ గంటా 20 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్ గిరిజన ప్రాంతాలకు చెందిన బిడ్డలు ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఔనత్యాన్ని మరింత ఇనుమడింపచేశారని కొనియాడారు.

జాతీయజెండాను ఎగురవేసిన ప్రధాని

Submitted by arun on Wed, 08/15/2018 - 09:51

72వ స్వాతంత్య్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాజ్ ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట సమీపంలో తన వాహనం నుంచి దిగిన మోదీ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తూ కోటపైకి చేరుకున్నారు. ఈ స్వాతంత్ర్య వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక...మూడో కూటమితో మారనున్న రాజకీయం

Submitted by arun on Mon, 08/06/2018 - 11:24

చెక్కతో చేసిన కీలు గుర్రం గాల్లో ఎగురుతుందా ? 1949లో విడుదలైన కీలుగుర్రం సినిమాలో మాత్రం ఆ గుర్రం గాల్లో ఎగిరింది.  ఇప్పుడు దేశంలో విపక్షాల నాయకులు ఎంతో మంది కీలుగుర్రాలపై విహరిస్తున్నారు. కాకపోతే అవి నేలపైనే ముందుకూ, వెనక్కూ ఊగుతున్నాయి. అయినా కూడా విపక్ష నాయకుల కలల విహారాలు మాత్రం ఆగడం లేదు.  విపక్ష నాయకులు ఎంతో మంది ఇప్పుడు ప్రధానమంత్రి పీఠంపై కన్నేశారు. అలాంటి వారంతా ఒకవైపున కాంగ్రెస్ పై రకరకాల ఒత్తిళ్ళు తెస్తూ, మరో వైపున ఎవరికి వారు మూడో ఫ్రంట్ దుకాణం ఏర్పాటుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి విపక్షాల వ్యూహాలు ఫలిస్తాయా ? కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ?

ప్రధాని మోడీ వ్యాఖ్యలతో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు

Submitted by arun on Sat, 07/21/2018 - 16:56

పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతలను ఇరకాటంలో పెట్టాయి. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు ప్రధాని మోడీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తి స్థానిక నేతలను గందరగోళంలోకి నెట్టారు. దీంతో ఇప్పుడు తామెలా వ్యవహరించాలో అర్ధంకాక అయోమయంలో పడ్డారు తెలంగాణ బీజేపీ నేతలు. 

వైసీపీ ఉచ్చులో పడొద్దని చంద్రబాబుకు ఆనాడే చెప్పా : మోడీ

Submitted by arun on Sat, 07/21/2018 - 10:38

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు మోడీ. టీడీపీ అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన నరేంద్రమోడీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై మళ్లీ పాత పాటే పాడారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబే యూటర్న్‌ తీసుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాక రేపుతున్న అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:00

ఇప్పుడు దేశం మొత్తం చూపు అవిశ్వాసంపైనే. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు చర్చకు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే యత్నాల్లో తలమునకలైన టీడీపీ చర్చ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.