narendra modi

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ.......:రజినీ

Submitted by chandram on Tue, 11/13/2018 - 12:51

బీజేపీ పార్టీపై తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, సానుకూలంగా ఉండే రజినీ ఇప్పుడు బిన్న వ్యాఖ్యలు చేయడంతో అందరిలోనూ చర్చనీయాంశమైంది. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలన్నీ అన్ని బీజేపీపై తీవ్రవ్యతిరేకతో కూటమి ఏర్పడుతున్నాయి, అంటే బీజేపీ ఎంత ప్రమాదకరమైన పార్టీయో అర్థమౌతుంది. ఇటివల పెద్దనోట్ల రద్దుపై ప్రధానిమోడీ సంచలన నిర్ణయానికి రజినీకాంత్ సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పుడు పెద్దనోట్లుపై ఘాటువ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దును సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రజలు నానాపాట్లు పడుతున్నారని తెలిపారు.

‘సర్దార్‌’ విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని మోదీ

Submitted by arun on Wed, 10/31/2018 - 12:56

భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ  ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కు మోదీ నివాళులు అర్పించారు. దాదాపు 30 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 37 మంది పటేల్ కుటుంబీకులు పాల్గొన్నారు. పటేల్‌ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం చేపట్టారు.

కేసీఆర్ సర్కార్ కు కేంద్రం ఊహించని షాక్

Submitted by arun on Tue, 10/16/2018 - 11:08

తెలంగాణ ప్రభుత్వానికి  మోదీ సర్కార్ ఊహించని షాకిచ్చింది.  కేంద్రం కేటాయించిన నిధులను వినియోగించుకోకుండా తాత్సారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు  2016-17 ఏడాదికి గాను కేంద్రం తెలంగాణకు 70 వేల 674 ఇళ్ల కోసం 190.78 కోట్లను కేటాయించింది. అయితే ఈ నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రెండేళ్లు గడిచినా  నిధులను వినియగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆపరేషన్‌ గరుడలో భాగమే

Submitted by arun on Fri, 10/12/2018 - 12:10

ఏపీలో ఐటీ దాడులపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోడీ కక్ష గట్టారని విమర్శించారు. కడప ఉక్కు...ఆంధ్రుల హక్కు అని అన్నందుకే ఎంపీ సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్‌ స్పష్టం చేశారు.

మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం

Submitted by arun on Tue, 10/09/2018 - 14:37

తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నోరు మూసుకున్నారని టి.కాంగ్రెస్‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు కాకున్నా బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహకరించిందని ఆరోపించారు. మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ కూడా కేసీఆర్ రెడీ చేసి అమిత్‌షాకు ఇచ్చారని విమర్శించారు. 119 స్థానాలలో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించిన పొన్నం వేరే పార్టీలలో టికెట్లు రాని నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.

సిక్కింలో తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోడీ

Submitted by arun on Mon, 09/24/2018 - 13:11

ప్రధాని మోదీ సిక్కీంలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విమానాశ్రయం సిక్కీం ప్రజలకు ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2009లో పాక్యాంగ్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగగా ఇది పూర్తవడానికి 9 ఏండ్లు పట్టింది. 201 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం పాక్యాంగ్ గ్రామానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది.

భారత్‌పై విషం చిమ్మిన ఇమ్రాన్ ఖాన్

Submitted by arun on Mon, 09/24/2018 - 12:33

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ నోరు పారేసుకున్నారు. ముందు చూపు లేని తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటూ మోడీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పాక్‌తో చర్చలకు భారత్‌ నో చెప్పినందుకు ఇమ్రాన్‌ విషం చిమ్మారు. పాకిస్థాన్ తో చర్చలకు భారత్ వెనక్కి తగ్గడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.

రాఫెల్ డీల్‌పై రాజుకుంటున్న వివాదం...మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Submitted by arun on Sat, 09/22/2018 - 16:54

రాఫెల్‌ ఒప్పందం విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తన విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్‌ పేరుతో మోదీ, అనిల్‌ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్‌ దాడులు చేశారని దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యలపై మోడీ ఇప్పటికైనా స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల ధరల విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.   

భారత్ - పాక్ సంబంధాలు బలపడుతాయా...విదేశాంగ మంత్రుల భేటీ ఏం సాధించనుంది ?

Submitted by arun on Fri, 09/21/2018 - 13:52

భారత్.....పాకిస్థాన్.... ఈ రెండు దేశాల మధ్య మిత్రత్వం కంటే శత్రుత్వమే అధికంగా కొనసాగుతోంది.  పాకిస్థాన్ లో సైన్యం ప్రాబల్యం అధికం కావడంతో పౌర ప్రభుత్వం మాటకు విలువ లేకుండా పోయింది. ఇటీవల  మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో కొత్త పౌర ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా ఆయన భారత ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. రెండు దేశాల మధ్య చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరారు. అందుకు భారతదేశం కూడా సానుకూలంగా స్పందించింది. మరి రెండు దేశాల మధ్య చర్చలు సాధ్యపడుతాయా ? స్నేహసంబంధాలు బలపడుతాయా ?శాంతి ప్రయత్నాలను పాకిస్థాన్ సైన్యం సహిస్తుందా ?

మోదీ కోసం సాహసం...13 వేల అడుగుల ఎత్తు నుంచి...

Submitted by arun on Tue, 09/18/2018 - 15:13

ప్రధాని నరేంద్రమోడీకి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా స్కై డైవర్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శీతల్ మహాజన్ ఏకంగా 13 వేల అడుగుల పై నుంచి కిందికి దూకూతూ మోడీకి విషెస్ చెప్పారు. తనకు ఇష్టమైన స్కై డైవింగ్‌ చేస్తూ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంది పారాజంపర్‌ శీతల్‌ మహజన్‌. వెంటనే ఆకాశంలో 13 వేల అడుగుల ఎత్తు వరకు విమానంలో చేరుకుంది. ‘ప్రధాని మోదీకి శుభాకాంక్షలు’ అని రాసి ఉన్న పేపర్‌ను చేతిలో పట్టుకుని అక్కడి నుంచి దూకేసింది. అమెరికాలోని చికాగోలో ఈ సాహసం చేసింది శీతల్‌.