prakash raj

ప్రకాష్ రాజ్-అనుపమ మధ్య గొడవ....స్పందించిన అనుప‌మ‌

Submitted by arun on Thu, 07/12/2018 - 13:22

రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా త్రినాథ్‌ రావ్‌ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో గురు ప్రేమ కోసమే'. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల సెట్స్‌లో ప్రకాష్ రాజ్-అనుపమ మధ్య గొడవ జరిగిందని.... ఆ సంఘటన తర్వాత ఒత్తిడికి గురైన అనుపమ కళ్లు తిరిగి పడిపోయిందని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి అనుపమ స్పందించింది.

నటుడు ప్రకాశ్ రాజ్ హత్యకు కుట్ర!

Submitted by arun on Wed, 06/27/2018 - 16:48

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. ఎంక్వైరీ సందర్భంగా సిట్‌కు షాకిచ్చే నిజాలు తెలిశాయి. నటుడు ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం వెలుగు చూసింది. గౌరీ లంకేష్‌ను హత్య చేసినవారే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను ఓ ప్రముఖ కన్నడ వార్తా ఛానెల్ ప్రసారం చేసింది. ట్విట్టర్‌లో దీన్ని కోట్ చేసిన ప్రకాశ్ రాజ్ తనపై జరిగిన హత్య కుట్రపై స్పందించారు. ‘‘ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇక నుంచి నా గళం మరింత పెరుగుతుంది’’ అని అన్నారు.
 

ప్రకాష్ రాజ్.. ముందు నీ అహంకారం తగ్గించు: టాలీవుడ్ నిర్మాత

Submitted by arun on Mon, 12/18/2017 - 15:40

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్రశ్న సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150+ సీట్లలో గెలుపొందుతుందనీ  ఢంకాబజాయించారు. మరి ఇపుడు 150 సీట్లు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఫలితాలపై ప్రకాష్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' అంటూ సోమవారం ఓ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.