ambulance

గర్భిణీని 12 కిలోమీటర్లు భుజాలపై మోసిన భర్త

Submitted by arun on Tue, 07/31/2018 - 15:38

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నా అడవి బిడ్డల తలరాతలు మారడం లేదు. అడవులనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్న గిరిపుత్రులకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. విద్య, వైద్య అవసరాలు కూడా లేక నేటికి ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఓ బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నరక యాతను అనుభవించారు. సాలూరు మండలం సిరివరకు చెందిన జిందమ్మ అనే గిరిజన మహిళ నెలలు నిండకుండానే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డ మృతి చెందగా తల్లి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. 

అంబులెన్స్‌లో మద్యం.. రష్యన్‌ డ్యాన్సర్లతో బెల్లి డ్యాన్స్‌

Submitted by arun on Tue, 12/26/2017 - 17:45

అంబులెన్స్‌ ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్‌ శబ్దం వినిపిస్తే ప్రధానులు సైతం తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్‌ను డాక్టర్లు మద్యాన్ని తరలించడం కోసం​ వినియోగించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ మీరట్‌లోని లాలా లజపతిరాయ్‌ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మద్యాన్ని తరలించడం కోసం అంబులెన్స్‌ను ఉపయోగించుకున్నారు. అంతేకాక సరదా కోసం రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లను పిలిపించుకుని హడావుడి చేశారు.

కారు అనుకుని.. అంబులెన్సులో వెళ్లాడు

Submitted by arun on Mon, 12/18/2017 - 14:32

ఆడి కారుకి, అంబులెన్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ మ‌ద్యం మ‌త్తులో చెన్నైకి చెందిన ఓ వ్యాపార‌వేత్త‌కి అవి రెండూ ఒకేలా క‌నిపించాయి. దీంతో స్నేహితుడిని ఆస్పత్రిలో చేర్పించేందుకు ఆడి కారులో వచ్చి, తిరిగి వెళ్లేటప్పుడు అంబులెన్సు తీసుకుని వెళ్లాడు. దక్షిణ చెన్నైలోని పళవాక్కం ప్రాంతానికి చెందిన మిథిల్‌ అనే వ్యాపారవేత్త అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడిని చేర్పించేందుకు ఆదివారం అర్థరాత్రి 1.30 ప్రాంతంలో స్థానిక ఆస్పత్రికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పార్కింగ్‌ స్థలంలో ఉన్న అంబులెన్సును తన కారు అనుకుని అందులో ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.