minister ktr

నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ...

Submitted by arun on Tue, 11/13/2018 - 15:58

టీఆర్ఎస్ తమ అభ్యర్థులను రెండు నెలల క్రితం ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిన్న అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర రచ్చరచ్చ జరుగుతోందనీ, టికెట్లు రాని అభ్యర్థులు అక్కడే వంటావార్పు చేసుకుని ధర్నాలకు దిగుతున్నారని వెల్లడించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు సెలైన్లు పెట్టుకుని మరీ ఆందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పత్రికల్లో ఫొటోలు చూస్తుంటే నాంపల్లి దగ్గర ఉన్నది గాంధీ భవనా? లేదా గాంధీ ఆసుపత్రా?

నాది పొగరు కాదు పౌరుషం...

Submitted by arun on Tue, 10/30/2018 - 16:12

మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఆరోపించారు.  మంగళవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా తాము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ కు కనిపించడంలేదా.. అని ప్రశ్నించారు. రాహుల్ ఓ తెల్లకాగితమని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే తెలుసన్నారు. తనది పొగరు కాదని.. పౌరుషమన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ జట్టుకట్టిందని విమర్శించారు. మహాకూటమికి ఓటేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్టు అవుతుందని వ్యాఖ్యానించారు.

జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కేటీఆర్

Submitted by arun on Thu, 10/25/2018 - 17:12

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
 

కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు..

Submitted by arun on Thu, 10/11/2018 - 15:49

కాంగ్రెస్‌ పార్టీకి క్యాడర్‌ లేదని, టీటీడీపీకి లీడర్‌ లేరని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ నేత కేటీఆర్‌. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. కరువు కోరల్లో ఉన్న సిరిసిల్లను మూడేళ్లలో అభివృద్ధిలోకి తెచ్చామని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సిరిసిల్లను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లేనని కేటీఆర్‌ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయని, కేసీఆర్‌‌ను గద్దె దించడమే లక్ష్యమంటున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు. 

ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్‌

Submitted by arun on Fri, 10/05/2018 - 11:24

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ట్విట్టర్‌‌లో గంటపాటు సాగిన ముఖాముఖిలో అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ముఖ్యంగా మహా కూటమిపై విరుచుకుపడ్డ కేటీఆర్‌ ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 

సింహం సింగిల్‌గానే వస్తుంది: మంత్రి కేటీఆర్

Submitted by arun on Mon, 07/30/2018 - 17:31

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయట అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంత మంది కలిసినా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని, రానున్న ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే కేసీఆర్ చేసిన పనులకు సార్థకత ఉంటుందని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
 

కేసీఆర్‌...నీ కుమారుడిని అదుపులో పెట్టుకో: వీహెచ్

Submitted by arun on Sat, 06/30/2018 - 14:45

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు కేటీఆర్‌లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. తమ అధినేత్రి సోనియా గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.  విదేశాల్లో చదువుకున్నానంటూ చెబుతున్న కేటీఆర్  కనీస సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా  కేటీఆర్‌ను అదుపులో పెట్టకపోతే విపత్కర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కుటుంబ పార్టీ ఎక్కడుండేదని వీహెచ్ ప‌్రశ్నించారు.    

తెలంగాణ సఫల రాష్ట్రంగా స్థిరపడింది: కేటీఆర్‌

Submitted by arun on Sat, 06/02/2018 - 14:44

సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణం కాలేజ్ గ్రౌండ్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయని... ఈనాడు పరిపాలనలో కూడా ఎదురవుతున్నాయని అన్నారు. సంకల్పం గట్టిదయితే ఎన్ని అవరోధాలైన అవలీలగా అధిగమించవచ్చిన ప్రభుత్వం రుజువుచేసిందని కేటీఆర్ తెలిపారు.

పేరులో నేముంది.. కేటీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Submitted by arun on Thu, 05/24/2018 - 17:54

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆ పేరెలా వచ్చిందో తెలిసిపోయింది. దాని వెనుక ఉన్న కథ గుట్టు వీడిపోయింది. అన్న ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ సమక్షంలోనే కేటీఆర్ తన పేరు విషయంలో ఇన్నాళ్లూ ఉన్న రహస్యాన్ని విప్పిచెప్పారు. 

మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం

Submitted by arun on Sat, 04/14/2018 - 17:44

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్రభారతిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడేందుకు లేవగా ఓ వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జ్యోతిరావు పూలేకు నివాళి అర్పించి, అంబేద్కర్ కు ఎందుకు అర్పించలేదని ప్రశ్నించాడు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆందోళన చేస్తున్న వ్యక్తితో మాట్లాడాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవిని కేటీఆర్ ఆదేశించారు. స్టేజీ పైనుంచి కిందకు దిగిన రవి..