Divorce

భార్య విడాకులు కోరిందని.. ఊహించని షాకిచ్చిన భర్త..!

Submitted by arun on Mon, 08/13/2018 - 12:52

విడాకుల నోటీసులు పంపిందనే ఆగ్రహంతో ఓ వ్యక్తి.. తన భార్య ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకున్నది. తిరునల్వేలి వన్నార్‌పేటకు చెందిన సెల్వి (30), తూత్తుకుడికి చెందిన శరవణన్‌ (32) అనే వ్యక్తిని ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. ఇరువురూ తూత్తుకుడి లో కాపురం చేస్తున్నారు. తాగుబోతు అయిన అతను.. నిత్యం భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులను భరించలేక శరవణన్ భార్య విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. శనివారం రాత్రి తప్పతాగి భార్య ఇంటికి వెళ్లిన శరవణన్.. ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. మంటల కారణంగా ఇంట్లో పార్క్‌చేసిన రెండు మోటర్‌బైక్‌లు కాలిపోయాయి.

భార్య అనుమానం.. ఆ వీడియోలు పంపిన భర్త

Submitted by arun on Wed, 08/01/2018 - 10:47

తన భర్త  సంసారానికి పనికి రాడని ఓ భార్య పెళ్లైన 15 రోజులకే  కోర్టును ఆశ్రయించింది. కోపోద్రిక్తుడైన భర్త తన భార్యకు ఏలాగైనా బుద్ధి చెప్పాలని మరో మహిళతో కలిసి అశ్లీలంగా ఉన్న వీడియోను  భార్య అమ్మనాన్నలకు పంపించాడు. సదరు భర్త, భార్యకు బుద్ది చెప్పబోయే క్రమంలో తానే ఇరుకునపడి జైలు పాలయ్యాడు. వివరాలు.. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ నగర్‌కు చెందిన విభావసుకు, తమిళనాడులో కొడింగ్యాయుర్‌లోని ముతామిజ్‌ నగర్‌కు చెందిన అనూషకు రెండేళ్లకిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన 15 రోజులకే అనూష తిరిగి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిపోయారు.

Tags

భార్యకు గడ్డం పెరుగుతోందని విడాకులు కోరిన భర్త...

Submitted by arun on Tue, 06/19/2018 - 13:23

తన భార్యకు గడ్డం పెరుగుతోందని, గొంతు కూడా మగవారి మాదిరిగా ఉందని, పెళ్లి చూపుల్లో పరదా కట్టి కూర్చోబెట్టి చూడనివ్వలేదని ఆరోపిస్తూ, వివాహమైన తరువాత విడాకులకు దాఖలైన ఓ పిటిషన్ ను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. కోర్టు పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం అహ్మాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లికి ముందు తాను తన భార్య మొహాన్ని చూడలేదని కనీసం ఆమె గొంతు కూడా వినలేదన్నాడు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూసినప్పుడు ఆమె మొహం మీద పరదా ధరించిందన్నాడు. పరదా తీయమని తన భార్యను కోరితే అది వారి సాంప్రదాయం అని కాబట్టి పరదాను తొలగించకూడదని తన భార్య బంధువులు చెప్పారన్నారు.

విడాకులపై మంచు మనోజ్‌ స్పందన

Submitted by arun on Sat, 06/09/2018 - 11:27

మంచు మనోజ్ విడాకులు తీసుకోబోతున్నారు.. ఆమె భార్య ప్రణతితో బోలెడు గొడవలంట.. క్రిష్ లాగే ఈయన కూడా భార్య నుండి విడిపోతున్నారట.. అంటూ సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఈవార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవి పనికి మాలిన రూమర్స్ మాత్రమే నేను నా భార్యతో హ్యాపీగా ఉన్నా అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టారు మంచు మనోజ్. 

క్రిష్ తన భార్య నుండి విడిపోతున్నాడా ?

Submitted by arun on Fri, 06/01/2018 - 15:28

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు క్రిష్‌. ప్ర‌స్తుతం హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌ణిక‌ర్ణిక అనే చిత్రంతో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే క్రిష్ తన స‌తీమ‌ణి నుండి విడాకుల‌కి ద‌రఖాస్తు చేసిన‌ట్టు ఓ వెబ్ సైట్ ప్ర‌చురించ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చర్చ‌నీయాంశంగా మారింది. గౌత‌మి పుత్ర శాత‌కర్ణి చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఆగ‌స్ట్ 7న ర‌మ్య అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు క్రిష్‌.

భార్య స్నానం చేయడం లేదని భర్త విడాకులు

Submitted by arun on Fri, 01/12/2018 - 14:35

తన భార్య ఏడాదికాలంగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు ఇచ్చిన ఘటన తైవాన్ దేశంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్య ఏడాదికాలంగా అసలు స్నానం చేయడం లేదని...వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. బాధితుడు కోర్టు ముందుంచిన అంశాలను చూస్తే... ‘‘ప్రేమించుకునే సమయంలో నా ప్రియురాలు వారానికోసారి స్నానం చేసేది. పెళ్లయిన తర్వాత ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తోంది. అది కూడా ఆరు గంటల సమయం తీసుకుంటోంది.

కీర్తి రెడ్డితో విడాకుల గురించి స్పందించిన సుమంత్‌!

Submitted by arun on Mon, 12/18/2017 - 12:27

''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సుమంత్. కీర్తిరెడ్డితో తను విడిపోవ‌డానికి గ‌ల కార‌ణం వివరించాడు. ఏడాదిన్న‌ర మాత్ర‌మే నిలిచిన సుమంత్‌-కీర్తిరెడ్డిల బంధం విడిపోవ‌డానికి గ‌ల కార‌ణం... ఇద్ద‌రి వ్య‌క్తిత్వాల‌తో పాటు జీవితాలు కూడా పూర్తి భిన్న‌మ‌ని వారిద్ద‌రు తెలుసుకోవ‌డ‌మేన‌ట‌. క‌లిసి ఉండ‌లేమ‌ని భావించిన వీరిరివురు ఉమ్మ‌డి అంగీకారంతో ..సుహృద్భావ వాతావరణంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నామని సుమంత్ తెలిపాడు.