manda krishna madiga

చంపే బాధ్యతను ఓ మంత్రి, ఎమ్మెల్యేకు అప్పగించింది : మందకృష్ణ

Submitted by arun on Fri, 03/09/2018 - 17:45

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆ బాధ్యతను ఓ మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు అప్పజెప్పిందని ఆరోపించారు. సూర్యాపేట నుంచి ఓ కారు తన వాహనాన్ని వెంబడిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు వాహనాన్ని గుర్తించలేదన్నారు. ఈ నెల 13న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. 24 ఏళ్ల పోరాటంలో ఎప్పుడు ఇంత ఆందోళనకు గురి కాలేదన్నారు మందకృష్ణ. 

మంత్రి కడియంపై మందకృష్ణ ఫైర్‌

Submitted by arun on Sat, 12/30/2017 - 19:03

మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలకు మందకృష్ణ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకోవడంలో కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకోవాలంటూ సలహానిచ్చిన కడియం శ్రీహరి ఎన్నిసార్లు ఢిల్లీలో పోరాటం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీలో పోరాటం చేశామన్న మందకృష్ణ మరోసారి హస్తినలో దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అయితే తన దీక్షకు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. 24ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నానన్న మందకృష్ణ ఎన్నో ఏళ్లుగా మంత్రిగా పనిచేస్తున్న కడియం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

దొరలకు ఒక చట్టం..దళితులకు ఒక చట్టమా?

Submitted by arun on Wed, 12/27/2017 - 14:49

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. గత పది రోజులుగా జైలులో ఉన్న ఆయన ఈరోజు బెయిల్‌ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని మందకృష్ణ మాదిగ విమర్శించారు. మిలియన్‌ మార్చ్‌, తెలంగాణ ఉద్యమం సందర్భంగా లేని నిర్బంధం ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై ఎందుకని ప్రశ్నించారు. 

పోలీసులను ఉరుకులు పెట్టించిన మంద కృష్ణమాదిగ

Submitted by arun on Mon, 12/18/2017 - 11:26

కనివిని ఎరుగని రీతిలో భారతి సంస్మరణ సభ జరుగుతుందని చెబుతూ వచ్చిన మంద కృష్ణమాదిగ నిజంగానే ప్రభుత్వాన్ని, పోలీసులను ఉరుకులు పెట్టించారు. ఎవరూ ఊహించని విధంగా ట్యాంక్ బండ్ ముట్టడికి పిలుపునిచ్చాడు. దీంతో వేలాది మంది ఉవ్వెత్తున ఎగసిపడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సంస్మరణ సభ సిక్ విలేజ్‌లో ఆదివారం సాయంత్రం 4గంటలకు మొదలైంది. 7గంటలకు మంద కృష్ణమాదిగ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.