YCP

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ఏపీ ఎంపీల ఆందోళన

Submitted by arun on Fri, 03/09/2018 - 11:14

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. మొదటి నాలుగు రోజుల ఉభయ సభలను స్థంభింపజేసిన ఏపీ ఎంపీలు ఇవాళ కూడా పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు నిరసనకు దిగనున్నారు. పార్లమెంట్‌లో వైసీపీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగనున్నారు. వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

టీడీపీ, వైసీపీలను ఇరుకున పెట్టిన పవన్

Submitted by arun on Tue, 02/20/2018 - 10:45

ఏపీ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మరింత వేడెక్కింది. జగన్ సవాల్ ను స్వీకరిస్తూ.. పవన్ కల్యాణ్ వెల్లడించిన తాజా వైఖరి.. టీడీపీతో పాటు వైసీపీని కూడా ఇరుకున పెట్టేలా ఉంది. ఆంధ్రా ప్రజల ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉన్నవారు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్న సర్వత్రా ఉదయిస్తున్న క్రమంలో.. టీడీపీ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న దరిమిలా అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటే ఎలాంటి మద్దతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ పవన్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 

జగన్... దమ్ముంటే ఈరోజే చేయించు

Submitted by arun on Wed, 02/14/2018 - 14:18

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనే అలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే భేటీ

Submitted by arun on Sat, 02/03/2018 - 16:04

సీఎం చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలవడం చర్చనీయాంశమైంది. గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద  ముస్తఫా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముస్తఫాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అంతకుముందు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో ముస్తఫా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. అయితే ముస్తాఫా టీడీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రస్తుతానికి తగ్గాయి.

కమలం పార్టీ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్షిప్ ఖాయం

Submitted by arun on Thu, 01/25/2018 - 12:45

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసిన సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఈ సారి వైసీపీతో దోస్తీ కట్టి బరిలోకి దిగనుందా? ఆ పార్టీ నేతల మాటలు, చేతలు చూస్తుంటే కమలం పార్టీ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్షిప్ ఖాయమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

వైసీపీకి మరో షాక్...త్వరలోనే పార్టీ మారనున్న కీలక నేత

Submitted by arun on Wed, 01/17/2018 - 12:07

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. ఇక సెకండరీ కేడర్ కూడా పెద్దఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆ పార్టీకి మరిన్ని దెబ్బలు తప్పేలా లేవు. ఇందుకు తాజా ఉదాహరణ వంగవీటి రాధా. పార్టీ పటిష్టత, అధికారమే లక్ష్యంగా ఆపార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా... ఒక్కోక్కరుగా నాయకులు వెళ్లిపోతూనే ఉన్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన వైసీపీ... తాజాగా మరో మాజీ ఎమ్మెల్యేను కూడా కోల్పోనుంది.

ఫిరాయింపు నేత‌ల్లో క‌ల‌వరం..ఆనందంలో జ‌గ‌న్

Submitted by arun on Mon, 01/08/2018 - 11:38

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను డిస్ క్వాలిఫై అయ్యేలా కఠినచర్యలు తీసుకోవాలన్న వైసీపీ డిమాండ్ నెరవేరుతుందా? ఢిల్లీలో ఆ పార్టీ నేతలు లోకసభ స్పీకర్‌కు ఇచ్చిన వినతి‌పత్రానికి ఫలితం ఉంటుందా? ఓ వైపు ఉపరాష్ట్రపతి పార్టీ ఫిరాయింపు దారులపై మూడు నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలన్న వ్యాఖ్యలు వైసీపీకి వరంగా మారుతాయా ?

ఏపీలో వేడెక్కిన రాజకీయం..వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్

Submitted by arun on Sun, 01/07/2018 - 14:45

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఒకరి ఇలాఖాలో మరొకరు పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికలే టార్గెట్‌గా నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. పులివెందుల ఈ సారి మాదేనంటుంటే.. మరొకరు కుప్పంలో గెలుపు ఖాయమంటున్నారు. ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. 2019 ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. పులివెందుల టార్గెట్‌గా టీడీపీ, కుప్పం టార్గెట్‌గా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. 

రోజా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెబుతా : బండ్ల గణేష్

Submitted by lakshman on Sun, 12/17/2017 - 18:31

వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు క్షమాపణలు చెబితే తాను రోజా కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత బండ్లగణేష్ తెలిపారు.