YCP

వైఎస్ జగన్‌ రిట్‌ పిటీషన్‌లో కీలక మలుపు

Submitted by arun on Fri, 11/09/2018 - 13:07

తనపై జరిగిన దాడి కేసు విచారణను స్వతంత్ర సంస్ధకు అప్పగించాలంటూ వైఎస్ జగన్ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ విచారణ కీలక మలుపు తిరిగింది. కేసు విచారణ జరుపుతున్న అధికారులకు సీఆర్‌పీసీ 161 ప్రకారం స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ జగన్‌ను  హైకోర్టు ఆదేశించింది. మంగళవారం లోపు స్టేట్ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు కేసు పూర్తి నివేదికను తమకు అందజేయాలంటూ సిట్‌ను ఆదేశించింది. 
 

వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత...హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు!

Submitted by arun on Wed, 10/17/2018 - 10:09

వైసీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ముందుగా అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. గత కొంతకాలంగా విశ్వేశ్వరరెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  

పవన్‌ వైపు పలువురు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నేతల చూపు...అధికార టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు...

Submitted by arun on Tue, 10/16/2018 - 10:03

ప్రజా పోరాట యాత్రతో జోరు పెంచిన జనసేనాని పవన్ కల్యాణ్‌ మరోపక్క పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు‌. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేనను బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం క్లీన్ ఇమేజ్‌ ఉన్న సీనియర్లను పార్టీలోకి తీసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కీలక నేతల వలసలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పవన్‌ త్వరలోనే మరికొందర్ని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 07/19/2018 - 15:44

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని...ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అని వ్యాఖ్యానించారు. ఫోర్త్ జెండర్ అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి అని, చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుతారని ఎంపీ విమర్శించారు. చంద్రబాబు ఓవైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 07/16/2018 - 10:27

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాసంప్రోక్షణ  పేరుతో తిరుమల ఆలయాన్ని తొమ్మిది రోజులు పాటు మూసివేయడంపై పలు అనుమానాలకు  తావిస్తోందని ఆరోపించారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించకపోవడం దారుణమన్నారు.  వెంకన్నను దర్శించుకోవడం కుదరదు కొండకు రావొద్దని టీటీడీ చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.  టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

ఆయన రాకతో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి: రోజా

Submitted by arun on Wed, 07/11/2018 - 14:45

పోలవరం పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి గడ్కరీ వస్తున్నారనగానే.. చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఏ కేంద్రమంత్రి వచ్చినా పట్టించుకోని బాబు.. గడ్కరీ వస్తున్నారన్నగానే.. కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులెవరినీ వెళ్లొద్దని చెప్పి తానే ముందు వెళ్లారన్నారు. దీనిని బట్టే పోలవరం పనుల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు రోజా. చిత్తూరు జిల్లా ఎస్వీపురంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆర్కే రోజా ట్రస్టు ద్వారా సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు.

వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 06/22/2018 - 13:09

వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేనాని తమకు మద్ధతిస్తాడంటూ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రకటించారు. తమపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్న మంత్రి నారా లోకేష్ తనకు మంత్రి పదవి ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ చురకలంచించారు. పవన్‌పై ఇప్పటికే రెండు సార్లు వరప్రసాద్ మద్దతు విషయంలో వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఇది నిజమా..? కాదా..? అని విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు ఇదంతా అబద్ధం..

వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కులు చింపిన విస్తరే

Submitted by arun on Sat, 06/16/2018 - 17:46

వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కులు చింపిన విస్తరి అవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయని, రాజకీయ, భౌతిక దాడులకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. నాడు గోద్రా అల్లర్లలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మోడీ వ్యవహరించారని, దీనిని వ్యతిరేకించినందుకే చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రధానిగా మోడీ ఉన్నంత వరకూ దేశ ప్రజలకు రక్షణ ఉండదని, దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీని గద్దె దించే దమ్ము చంద్రబాబుకే ఉందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 

కీలక నిర్ణయం తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 08:49

ఇప్పటికే అధినేత పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కడప జిల్లా మొదలు రాయలసీమను చుట్టేసి కోస్తాలోకి అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఊళ్లు, సరిహద్దులు దాటుకుంటూ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర జనసమీకరణతో జోరుగానే సాగుతోంది. ఆయనకు మద్దతగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు పాదయాత్రలు ప్రారంభించి జనాల్లోకి వెళుతున్నారు. కేవలం వీరే కాకుండా వైసీపీ అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాదయాత్ర చేయాలనీ నిర్ణయం తీయూసుకున్నారు.

విజయసాయిరెడ్డికి పిచ్చికుక్క కరిచింది...బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేయించాలి

Submitted by arun on Tue, 04/03/2018 - 15:58

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైరయ్యారు. విజయసాయికి పిచ్చి కుక్క కరిచిందన్న ఆయన....ఇలాంటి వ్యక్తులకు బోడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేయించాలన్నారు. కందకు లేని కత్తికి ఎందుకని...ప్రధాని వీడియో గురించి బీజేపీ నేతలకు లేని వైసీపీ ఎందుకని ప్రశ్నించారు. విజయసాయి బీజేపీ కోవర్టు అయినందునే....సభాహక్కుల నోటీసు ఇచ్చాడన్నారు.