chandhrababu

చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Submitted by lakshman on Wed, 03/14/2018 - 19:46

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్రాన్ని ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాసభ‌లో మాట్లాడిన ప‌వ‌న్ ..నాడు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఎమికి ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామంటూ అధికారంలో వ‌చ్చిన బీజేపీ ...ఆ హామీల్ని అమ‌లు ప‌రిచిందా అని ప్ర‌శ్నించారు. మీరిచ్చిన మాట‌ల్ని నిల‌బెట్టుకోన‌ప్పుడు మీ చట్టాల్ని మేమెందుకు పాటించాల‌ని మండిప‌డ్డారు. 

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న వైఎస్ జ‌గ‌న్

Submitted by lakshman on Wed, 03/14/2018 - 03:47


బీజేపీ - వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తో భేటీ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

చంద్ర‌బాబును అణ‌గ‌దొక్కుతున్న పీఎం మోడీ..?

Submitted by lakshman on Wed, 03/14/2018 - 03:21

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంక‌న్న పీఎం మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా , రైల్వే జోన్ ఇవ్వ‌క‌పోవ‌డంపై స్పందించిన బుద్ధా  సీఎం చంద్ర‌బాబు ముస్లీంలకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని ..ఆ కార‌ణంగానే చంద్ర‌బాబును అణ‌గ‌దొక్కాల‌ని చూస్తున్న‌ట్లు తెలిపారు. 
 ఆర్టికల్ 13 ప్ర‌కారం రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామంటూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చిన త‌రువాత కూడా ఎన్నోవాగ్ధానాలు చేసిన క‌మ‌లం పార్టీ నేత‌లు చంద్ర‌బాబు హ్యాండిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నట్లు టీడీపీ చెబుతున్నారు.  

త‌మ్ముళ్లకు విస్మ‌యాన్ని క‌లిగిస్తున్న చంద్ర‌బాబు నిర్ణ‌యం

Submitted by lakshman on Mon, 03/12/2018 - 09:37

టిడిపి రాజ్యసభ అభ్యర్థులుగా చంద్రబాబు ఎంపిక చేసిన ఇద్దరి పేర్లపై తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి తరుపున రెండు పేర్లు వెలువడిన వెంటనే మొదటి అభ్యర్థి అయిన సిఎం రమేష్ పేరుపై ఆశ్చర్యం కలగకపోయినా...వ్యతిరేకత మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో అభ్యర్థిగా వర్ల రామయ్య దాదాపుగా ఖరారైపోయిన దశలో చివరి క్షణంలో అనూహ్యంగా కనకమేడల రవీంద్ర కుమార్ కు అవకాశం లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే చంద్రబాబు నిర్ణయం బాధ కలిగించినా ఆయన నిర్ణయం తనకు శిరోధార్యమని వర్ల రామయ్య ప్రకటించడం టిడిపికి ఊరటనిచ్చింది.

జ‌గ‌న్ కు షాకిచ్చిన కేసీఆర్ - చంద్ర‌బాబు

Submitted by lakshman on Sun, 03/11/2018 - 09:20

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ కు ఏపీ సీఎం చంద్ర‌బాబు , తెలంగాణ సీఎం కేసీఆర్ షాకిచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా అవిశ్వాస తీర్మానాన్ని తెర‌పైకి తెచ్చారు. అయితే ఆ అవిశ్వాస తీర్మానం సోమ‌వారం పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌కు రానున్న నేప‌థ్యంలో వైసీపీ వ్యూహంపై  కేసీఆర్ - చంద్ర‌బాబు నీళ్లు చ‌ల్లే ప్ర‌య‌త్నం చేశారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. 

కేంద్రానికి చుక్కలు చూపిస్తున్నతెలుగు రాష్ట్రాలు

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:54

విభజన ప్రక్రియ ఏ ముహూర్తంలో మొదలైందో కానీ.. నాటి నుంచి ఇప్పుడు విభజన జరిగి నాలుగేళ్లు కావొస్తున్నా.. కేంద్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి తిప్పలు తప్పడం లేదు. నాడు యూపీయే ప్రభుత్వానికి ఈ సమస్యలు ఎదురైతే.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా.. ఏపీ, తెలంగాణ తీరుతో ఇబ్బందుల్లో పడుతోంది. విభజన హామీలు.. బడ్జెట్ లో కేటాయింపులపై.. కేంద్రం తెలుగు రాష్ట్రాల మీద వివక్ష చూపించడమే.. ఇందుకు కారణమవుతోంది.

బాబు అలిగారు.. షా ఫోన్ చేసి రమ్మన్నారు

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:45

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహాయం విషయంలో.. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం చంద్రబాబు కాస్త ఆగ్రహంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి కాస్త కదలిక వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ నెల 5న ఓ ప్రతినిధి బృందాన్ని పంపిస్తే.. కేంద్రం ఏం చేసింది.. ఇంకా చేయాల్సింది ఏం ఉంది అన్న విషయాలపై చర్చిద్దామంటూ చంద్రబాబుకు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారట.

జ‌గ‌న్ ఆ ఊర‌పంది ఆలోచ‌న‌ల్ని మానుకో

Submitted by lakshman on Fri, 02/23/2018 - 23:26

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి నిప్పులు చెరిగారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు ఆదినారాయ‌ణ‌రెడ్డి -  రామ‌సుబ్బారెడ్డి లు ఇద్ద‌రు త‌మ ప‌నుల్లో చెరో అర్ధ రూపాయి చొప్పున పంచుకోమ‌ని చెప్పారంటూ ఓ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. ఆవీడియో పై స్పందించిన ఆదినారాయ‌ణ రెడ్డి చంద్ర‌బాబు చెబితే తాము పంచుకునేంత నీచులమా...! తాను, రామసుబ్బా రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టినా సీఎం అంగీకరిస్తామని చెప్పారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కానీ వాటాల గురించి మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. తాము వాటాలు పంచుకునేంత నీచంగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు.

ఆ బీజేపీ మంత్రిపై చంద్ర‌బాబు చ‌ర్య‌లు..?

Submitted by lakshman on Wed, 02/21/2018 - 07:34

గతకొంత కాలంగా ఏపీ బిజెపి నేతలు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్నారు…అంతేకాదు మిత్ర పక్షం అయిన టిడిపి అధినేతపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉన్నారు..అయితే టిడిపి నేతలని మాత్రం చంద్రబాబు కామెంట్స్ చేయకండి అని అడ్డు చెప్పిన సందర్బాలు అనేకం ఉన్నాయి..అయితే టిడిపి తో పొత్తు కారణంగా అనుకోకుండా లక్కు కలిసొచ్చి దేవాదాయ శాఖామంత్రి గా ఎన్నికైనా మాణిక్యాలరావు..గత కొంతకాలంగా చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు..ఎప్పుడు వారి వారి మాటలని సీరియస్ గా తీసుకొని చంద్రబాబు మాత్రం.తాజాగా జరిగిన పరిణామాల విషయంలో ఎంతో ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు.

థ‌టీజ్ సీఎం చంద్ర‌బాబు

Submitted by lakshman on Fri, 02/16/2018 - 06:18

రాష్ట్రానికి సీఎం చంద్ర‌బాబు చేస్తున్న కృషిని వెల‌క‌ట్టలేం. అభివృద్ధి చేస్తే చేశాడు. లేదంటే చేయ‌లేదు అనడం ఉత్తమం. అభివృద్ధి చేసినా చేయ‌కపోయినా చేస్తున్న ప్ర‌తీ అభివృద్ధిలో  నెగిటీవ్ ను ఆలోచిస్తే ..మ‌న కార్య‌చ‌ర‌ణ‌కూడా మ‌న‌కు వ్య‌తిరేకంగా మారుతుంది.