janasena

టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. పిచ్చిపిచ్చి వేషాలొద్దు: పవన్

Submitted by arun on Thu, 07/05/2018 - 16:18

టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని టీడీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అని ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే ఉండాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు. అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు.

జనసేనాని మిషన్ 2019

Submitted by arun on Fri, 06/29/2018 - 12:25

ఇప్పటి వరకు పర్యటనలు, యాత్రలకే పరిమితమైన జనసేన  తాజా పరిణామాలతో జవసత్వాలు నింపుకుంటుందా ?  కలిసి నడుద్దామంటూ  కామెడ్స్‌  ఇచ్చిన ఆఫర్‌‌ను జనసేనాని అందుకునేందుకు సిద్ధమయ్యారా ? 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్  ప్రణాళికలు సిద్దం చేశారా ? అంటే అవుననే సమాధానాలు జనసేన నుంచి వినిపిస్తున్నాయి.  

జనసేనలోకి మాజీ క్రికెటర్‌

Submitted by arun on Thu, 06/28/2018 - 14:01

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌. సమస్యల పరిష్కరించడం కోసం తుదిశ్వాస వరకు పోరాడుతానన్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు గురువారం జనసేన పార్టీలో చేరారు. విశాఖలో జనసేన అధినేత పవన్‌ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. భారత్‌ తరపున 2005లో ఆరంగ్రేటం చేసిన వేణుగోపాలరావు శ్రీలంకతో తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు. పవన్‌ అభిమానులు సైతం భారీ సంఖ్యలో పార్టీలో చేరారు.  పోరాటయాత్రలో భాగంగా పవన్‌ విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

మేం గెలుపొందే మొట్టమొదటి సీటు అదే....

Submitted by arun on Sat, 06/09/2018 - 11:57

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2014 ఎన్నికల్లోనే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్నా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మిన్నకుండిపోయామన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పవన్‌ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన పవన్, ఫ్లెక్సీలు కడుతూ ఇటీవల చనిపోయిన శివ-నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ర్యాలీలో ఆవేశంగా ప్రసంగించాడు. ఇంతకీ.. పాయకరావుపేట జనసేన అభ్యర్థి ఎవరు? అన్న క్లారిటీ అయితే లేదు. ఫలానా వ్యక్తికి టిక్కెట్ ఇస్తున్నానన్న స్పష్టత ఇవ్వకుండానే ప్రసంగాన్ని ముగించారు పవన్.

పవన్ యాత్రకు బ్యాక్ టూ బ్యాక్ బ్రేక్‌లు

Submitted by arun on Wed, 06/06/2018 - 13:00

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రతో జగన్‌ ఫుల్‌ స్పీడ్‌లో ఉంటే....జనసేనాని మాత్రం యాత్రకు బ్రేకులు వేస్తున్నారు. ఇది ఇప్పుడు జనసేన హాట్‌ టాపిక్‌గా మారింది. పూర్తి స్థాయిల్లో ప్రజల్లోకి వెళ్లాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నా...అందుకు పార్టీ కేడర్‌ మాత్రం సహకరించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయ్. 

ముగిసిన పవన్ నిరాహారదీక్ష

Submitted by arun on Sat, 05/26/2018 - 17:43

ఉద్దానం బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేందటూ.. పవన్ కల్యాణ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ముగిసింది. తను విధించిన 48 గంటల డెడ్ లైన్ ను ఏపీ సర్కార్ లైట్ తీసుకోవడంతో.. ముందుగా చెప్పినట్లుగానే.. దీక్షకు కూర్చున్నారు. ఇప్పటికే ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై 17 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచింది జనసేన. ఉద్దానం కిడ్నీ బాధితులను  ఆదుకోవాలంటూ తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దీక్షకు దిగాల్సి వచ్చిందని పవన్ చెప్పారు.
 

దీక్ష చేపట్టేందుకు రెడీ అవుతోన్న పవన్‌కల్యాణ‌్

Submitted by arun on Fri, 05/25/2018 - 13:31

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధించిన డెడ్‌లైన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ప్రభుత్వం తీరును నిరసిస్తూ పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని పవన్ వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీక్షకు అనుమతి కోసం శ్రీకాకుళం పోలీసులకు దరఖాస్తు చేయనున్నారు. 

‘జనసేన’పై బాబు నిఘా?

Submitted by arun on Wed, 04/18/2018 - 13:42

ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, మంత్రి నారా లోకేష్‌పైనా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తోన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టిందా? జనసేన కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గూఢచారులను నియమించుకుందా? పవన్‌‌ను ఎవరెవరు కలుస్తాన్నారో ఆరా తీస్తోందా? సరిగ్గా ఇలాంటి అనుమానమే పవన్‌ కల్యాణ్‌‌కు వచ్చింది. జనసేన అంతర్గత విషయాలు లీకవుతున్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.