Naini Narasimha Reddy

కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు: నాయిని

Submitted by chandram on Wed, 11/21/2018 - 16:27

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100పైగా సీట్లతో విజయభేరీ మోగిస్తుందని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. ఇక మ‍హాకూటమిపై నాయిని చమత్కరం చేశారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలోని అభ్యుర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తమ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు పట్టం కడతరాని ధీమావ్యక్తం చేశారు. డిండి ప్రాజేక్టు పథకంతో దేవరకొండ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. నేడు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో నాయిని ప్రసంగించారు.

టీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ల మధ్య 10 కోట్ల పంచాయతి

Submitted by arun on Sat, 10/13/2018 - 17:44

టీఆర్ఎస్‌ కాంగ్రెస్‌ల మధ్య 10 కోట్ల పంచాయతి ముదురుతోంది. నాయిని వ్యాఖ్యలను సుమోటగా తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే ఎప్పుడు జరిగిందో తెలుసుకోకుండా ఫిర్యాదులు చేస్తే ఎలాగంటూ టీఆర్ఎస్‌ చురకలు అంటిస్తోంది. టీఆర్ఎస్ నేత నాయినినర్సింహారెడ్డిపై సీఈవో రజత్‌కుమార్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పినట్టుగా నాయిని వ్యాఖ్యానించారని ఫిర్యాదు చేశారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈవోను రేవంత్‌ కోరారు.