Siddipet

హరీష్‌రావు ఎమోషనల్‌....రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్‌ తీసుకుంటే బాగుటుందనిపిస్తోంది...

Submitted by arun on Sat, 09/22/2018 - 10:22

హరీష్‌రావు ఎమోషనల్‌ అయ్యారు. రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్‌ తీసుకుంటే బాగుటుందనిపిస్తోందంటూ అన్నారు. హరీష్‌ అన్నకే మా ఓటంటూ దత్తత గ్రామం  ఇబ్రహీంపూర్‌ ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేయడం చూసి హరీష్‌ ఎమోషనల్‌గా ఫీలయ్యారు. జనాల ఆదరణ చూస్తే భావోద్వేగం. జనహోరును చూస్తే ఆపుకోలేని ఉద్వేగం. అంతులేని అభిమానంతో కట్టలు తెంచుకునే అంతరంగం. ఇంతకంటే ఏం కావాలి, ఈ ఉన్నతమైన దశలోనే నిష్క్రమించాలన్న భావావేశం. ఒక మోడీ, ఒక కేసీఆర్, ఒక వైఎస్‌ఆర్‌. భావోద్వేగ ప్రసంగాలతో జనాన్ని కనికట్టు చేశారు. ఇప్పుడు హరీష్‌ రావు కూడా, జనాభిమానాన్ని చూసి, భావోద్వేగంతో కదిలిపోయాడు. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు? ఎందుకంత ఎమోషనల్‌ అయ్యారు?

సిద్దిపేట జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్‌

Submitted by arun on Wed, 06/27/2018 - 11:45

సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం లద్దూర్‌లో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. గ్రామంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి... వీధుల్లో పరిగెడుతూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. గ్రామస్తులు ఎలుగుబంటిని వెంబడించడంతో... ఓ ఇంట్లోకి దూరి.... ఒకరిపై దాడి చేసింది. దాంతో ఎలుగుబంటిని గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టారు. వన్య మృగాలు తరచూ గ్రామంలోకి వస్తున్నాయని... ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందో తెలియక భ‍యంతో వణికిపోతున్నామని గ్రామస్తులు అంటున్నారు. వన్య మృగాలు గ్రామంలోకి రాకుండా.... ఫారెస్ట్ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

సిద్ధిపేట జిల్లాల్లో ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందుతున్న కొమురవెళ్లి

Submitted by arun on Sun, 12/17/2017 - 12:05

భక్తుల కొంగు బంగారంగా వెలుగుగొందుతున్న కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం ఇవాళ అంగరంగవైభవంగా జరగనుంది. సిద్ధిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న మల్లన్న ఆలయం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. దీంతో మల్లన్న కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.