cancer treatment

ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను: సోనాలి

Submitted by arun on Tue, 10/09/2018 - 17:35

 స్టార్ హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ ఇటీవల తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు ఆమె తాజాగా చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ఓ ఫొటోను షేర్‌ చేశారు.‘కొన్ని నెలలుగా మంచి, చెడు రెండూ అనుభవిస్తున్నా. చికిత్స జరుగుతుండగా కనీసం నా చేతి వేలు కూడా పైకెత్తలేనంతగా తయారయ్యా. శారీరకంగా మొదలైన ఆ నొప్పి కాస్త మానసికంగా కూడా భాధ పెడుతోంది. కీమో థెరపీ, సర్జరీ జరిగిన తర్వాత కనీసం నవ్వినా కూడా నొప్పి వచ్చేది.