Jana Sena

ఏపీకి జరిగిన అన్యాయంపై జేఎఫ్‌సీ ఏం తేల్చనుంది

Submitted by arun on Sat, 02/24/2018 - 11:28

ఏపీకి జరిగిన అన్యాయంపై జేఎఫ్‌సీ ఏం తేల్చనుంది. సమావేశాలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా నివేదిక ఇవ్వడంలో ఆలస్యమెందుకు..? అసలు జేఎఫ్‌సీ ఇవ్వబోతున్న నివేదికలో ఏముంది..? తప్పు ఎవరిదని జేఎఫ్‌సీ తేల్చనుంది.

ఏపీకి జరిగిన అన్యాయంపై నిగ్గు తేల్చడానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ప్రత్యేక హోదా, ప్యాకేజీ, విభజన అంశాల విషయంలో ఎవరి పాత్ర ఎంత..? రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి కారకులెవరన్నదానిపై చర్చించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నివేదికను కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. 

ప్రత్యేక హోదా ఉద్యమంలో జనసేన మరో కార్యాచరణ

Submitted by arun on Thu, 02/22/2018 - 13:32

విభజన సమస్యలు, పరిష్కారాలపై జేఎఫ్ సీ పేరుతో రంగంలోకి దిగిన జనసేన ఈ అంశంలో యువతను ఉత్తేజపరచడానికి వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముద్రించిన టీ షర్ట్స్ ను సిద్ధం చేస్తోంది. ఈ టీ షర్ట్స్, క్యాప్స్ ను రాష్ట్రంలోని పలు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయనుంది. అంతేకాకుండా.. భగత్ సింగ్  స్టూడెంట్స్ యూనియన్  ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమానికి ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇటు శతఘ్ని టీమ్ తో డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. 
 

జనసేన పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి రంగం సిద్ధం

Submitted by arun on Tue, 02/20/2018 - 15:33

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మధ్య కీలకంగా మారింది పవన్ కల్యాన్ జనసేన పార్టీ. ఈ మధ్యకాలంలో ప్రత్యేకహోదా అంశం జనసేన పార్టీకి మరింత ప్రచారం తీసుకొస్తోంది. ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండటంతో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్ కల్యాణ్. త్వరలోనే పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

మహానటి సావిత్రికి కూడా పద్మఅవార్డు ఇస్తే బాగుండేది : పవన్ కల్యాణ్

Submitted by arun on Fri, 01/26/2018 - 15:32

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజాకు పద్మవిభూషన్‌ రావడంపై  సంతోషం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.   హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో  జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇళయరాజకు అభినందలు తెలిపారు. మహానటి సావిత్రికి కూడా పద్మఅవార్డు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.  రానున్న రోజుల్లో ఎస్వీ రంగారావు, సావిత్రికి పద్మఅవార్డు ఇప్పించేలా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. 
 

తెలంగాణవాసి

Submitted by arun on Tue, 01/23/2018 - 19:57

పవన్‌కల్యాణ్‌... తానిప్పుడు ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌ అంటున్నారు. తనకు ప్రాంతీయ బేధం లేదన్నారు. ఏపీ అయినా... తెలంగాణ అయినా ఒక్కటే అన్నారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని ఆవేశంగా ప్రసంగించారు. అందుకే తనకు జై తెలంగాణ అన్న పదం ఇష్టమని నినదించారు. జై తెలంగాణ ఇదీ పవన్‌కల్యాణ్‌ నోట వెంట వచ్చిన మాట. వందేమాతరం నినాదానికి ఎంత పవర్‌ ఉందో జై తెలంగాణ అన్న పదానికి కూడా అంతే పవర్‌ ఉందని పోల్చి చెప్పారు. దేశమంతా స్వాతంత్ర్యం వెలుగుల్లో విరాజిల్లుతుంటే తెలంగాణలో కమ్ముకున్న చీకటిని తొలగించి స్వేచ్ఛ కోసం పరితపించే నినాదమే జై తెలంగాణ అంటూ తనదైన శైలిలో భాష్యం చెప్పారు పవన్‌కల్యాణ్‌

చూడడానికి వస్తే మంచి గుణపాఠం చెప్పారు: పవన్ అభిమాని

Submitted by arun on Tue, 01/23/2018 - 15:19

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా రెండో రోజు కరీంనగర్‌లో పర్యటించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బసచేసిన హోటల్‌ వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో ఈ ఉదయం అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా హోటల్‌ అద్దాలు పగిలాయి. సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్వేతా హోటల్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పవన్ శ్వేతా హోటలకు వస్తాడని ముందే తెలుసుకున్న అభిమానులు.. తమ అభిమాన నటుడిని కలిసేందుకు అక్కడ పడిగాపులు కాశారు. తీరా పవన్ అక్కడికి వచ్చాక ముఖ్య నేతలతో భేటీ అయి వెనుదిరిగారు.

కాంగ్రెస్‌ నేతలంతా నా అన్నదమ్ములే: పవన్

Submitted by arun on Tue, 01/23/2018 - 15:03

కాంగ్రెస్‌ నేతలంతా తన అన్నదమ్ములేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ల పసిబిడ్డన్న జనసేనాని.... తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణను జాగ్రత్తగా కాపాడాలనే తాను ఆచితూచి మాట్లాడతానన్నారు. కేసీఆర్‌ అంటే తనకు చాలా ఇష్టమన్న పవన్....  రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాడేవారిని ప్రేమిస్తానని చెప్పారు.
 

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..

Submitted by arun on Tue, 01/23/2018 - 13:20

కరీంనగర్‌‌లో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ హైఓల్టేజ్‌ స్పీచ్‌ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్‌ ఆంధ్రా జన్మనిస్తే...తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందన్నారు. కొండగట్టు ఆంజనేయుడే తనకు పునర్జన్మనిచ్చాడని భాగద్వేగానికి గురయ్యారు. తెలంగాణ నేలకు ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటానన్నారు. వందేమాతరంలాంటి నినాదమే జైతెలంగాణ అన్న జనసేనాధిపతి వందేమాతరానికున్న శక్తి జైతెలంగాణ పదానికి ఉందన్నారు.

రక్తమోడుతున్న అభిమానిని చూపిస్తూ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం

Submitted by arun on Tue, 01/23/2018 - 12:37

కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో మూడు జిల్లాల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్, 'జై తెలంగాణ' అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జన సైనికుల ఉత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. తాను పిలిస్తే, తన కోసం వచ్చి తీవ్రంగా గాయపడిన ఓ అభిమానిని చూపిస్తూ, పవన్ కల్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. నేడు రెండో రోజు తన 'చలోరే చల్' యాత్రలో భాగంగా మూడు జిల్లాల అభిమానులను కలిసిన ఆయన, అభిమానులు అత్యుత్సాహాన్ని ఎక్కువగా చూపవద్దని కోరారు.

ఆంధ్రా జన్మనిస్తే...తెలంగాణ పునర్జన్మనిచ్చింది: పవన్‌కల్యాణ్

Submitted by arun on Tue, 01/23/2018 - 12:30

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు కరీంనగర్‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ... ఆంధ్రా నాకు జన్మనిస్తే... తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. కొండగట్టు ఆంజనేయుడు నన్ను కాపాడారని పవన్ గుర్తుచేశారు. తెలంగాణ నేలతల్లికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుందని పవన్ అన్నారు. వందేమాతరం లాంటి నినాదమే జై తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.