Jana Sena

వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 06/22/2018 - 13:09

వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేనాని తమకు మద్ధతిస్తాడంటూ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రకటించారు. తమపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్న మంత్రి నారా లోకేష్ తనకు మంత్రి పదవి ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ చురకలంచించారు. పవన్‌పై ఇప్పటికే రెండు సార్లు వరప్రసాద్ మద్దతు విషయంలో వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఇది నిజమా..? కాదా..? అని విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు ఇదంతా అబద్ధం..

జనసేనలో అంతర్గత విభేదాలు

Submitted by arun on Thu, 06/14/2018 - 13:13

తిరుపతి జనసేనలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. భౌతిక దాడులకు సైతం సేన కార్యకర్తలు తెగబడుతున్నట్టు బుధవారం అలిపిరి పోలీసులకు అందిన ఫిర్యాదు వెల్లడిస్తోంది. చిత్తూరు జిల్లా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి సురేష్‌పై అదేపార్టీకి చెందిన కిరణ్‌ రాయల్‌ మరికొందరు బుధవారం సాయంత్రం దాడిచేసినట్టు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడిచేసిన వారిని అరెస్ట్‌ చేయాలంటూ బాధితుడు సురేష్‌ పోలీసులను కోరారు. ఫిర్యాదు అనంతరం ఆ పార్టీనాయకుడు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోనే మరో వర్గం నాయకులు గురువారెడ్డి సమాధుల వద్ద తనపై దాడి చేశారన్నారు.

పవన్ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య !

Submitted by arun on Mon, 05/28/2018 - 11:31

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పవన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ  ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు సైతం ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. అయితే రాజమండ్రిలో జనసేన ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పాల్గొనడం ఆసక్తిని రేపుతుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు.

ఈ మౌనం వెనక అర్థమేంటి బాబూ?

Submitted by hmtvdt on Sun, 04/29/2018 - 23:35

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీని, సీఎం బాబును, మంత్రి లోకేష్ ను ఓ రేంజ్ లో ఆరోపణలతో ఆడుకుంటున్నారు. కానీ.. అంతకు తగిన విధంగా.. చంద్రబాబు నుంచి లోకేష్ నుంచి ఆఖరికిట టీడీపీ నేతల నుంచి కూడా ప్రతిస్పందన రావడం లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ప్రత్యక్షంగా ఓ సారి.. పరోక్షంగా మరోసారి కామెంట్లు చేస్తున్న పవన్ విషయంలో.. ఇంకా మౌనవ్రతాన్నే కొనసాగిస్తున్నారు..

జగన్‌, పవన్‌ ఒక్కటవుతున్నరా...సైకిల్‌కు పంక్చర్‌ పెట్టేస్తారా?

Submitted by arun on Wed, 04/25/2018 - 13:06

2019 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ వ్యూహామేంటీ ? ఆగష్ట్‌ 15న మేనిఫెస్టోను ప్రకటిస్తానన్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారా ? మేనిఫెస్టో ఎలా ఉంటుంది ? ఏపీ రాజకీయాల్లో పవన్‌ కార్యాచరణపై చర్చ జరుగుతోంది.

శేఖర్ రెడ్డికి పవన్ ఆధారాలు చూపించగలడా..?

Submitted by lakshman on Thu, 03/15/2018 - 21:56

తమిళనాడుకు చెందిన మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపణలపై స్పందించారు. తనకు లోకేష్ తో సంబంధమే లేదని.. చంద్రబాబునే ఒకటి రెండుసార్లు కలిశాను తప్ప.. లోకేష్ ను ఇంత వరకూ కలిసింది లేదని.. పవన్ కల్యాణ్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. పైగా.. ఓ సెటైర్ కూడా వేశారు. తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నపుడు.. చాలా మంది అభ్యర్థులు తనను కలుస్తారని చెప్పాడు.

పవన్ టార్గెట్ ఎవరు..?

Submitted by arun on Mon, 03/12/2018 - 16:03

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అయితే వచ్చింది. మరి పవన్ కల్యాణ్.. నెక్ట్స్  ఏం చేయబోతున్నారు..? ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటున్న పవన్.. హోదా కోసం తన తర్వాతి పోరు ఎలా ఉండబోతోంది..? ఈ విషయంలో బీజేపీ, టీడీపీ పార్టీల తీరుణు కడిగిపారేసిన పీకే.. తన పార్టీ ఆవిర్భావ సభలో ఏం చెప్పబోతున్నారు..? తన ఫ్యూచర్  పాలిటిక్స్ పై క్లారిటీ ఇవ్వనున్నారా..? 

పవన్ టార్గెట్ ఎవరు..జనసేనాని ఎవరిని కార్నర్ చేయనున్నారు..తన పోరు ఎవరిపైనో అనే వివరణ ఇస్తారా..పీకే ఫ్యూచర్ పాలిటిక్స్‌పై క్లారిటీ ఇస్తారా..?

మార్చి 3న ప్రజల ముందుకు జేఎఫ్‌సీ నివేదిక: పవన్‌

Submitted by arun on Fri, 03/02/2018 - 10:27

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ, ఏపీకి జరిగిన అన్యాయానికి కారణమెవరో తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని కమిటీ పవన్‌కు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఇరు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని తెలిపింది. ఇవాళ మరోసారి సమావేశమై నివేదికపై JFC చర్చించనుంది.