Jana Sena

తుదిశ్వాస వదిలేలోపు ఎంతోకొంత మార్పు తీసుకొస్తా: పవన్

Submitted by chandram on Sun, 12/16/2018 - 15:14

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో బీజీబీజీగా ఉన్నారు. అయితే అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో డాక్టర్లతో సమావేశం అయ్యారు. జనసేన ప్రవాస గర్జనలో పవన్ కళ్యాణ్  కళ్యాణ్ మాట్లాడుతూ తుది శ్వాస వదిలోపు ఎంతోకొంత మార్పు తెస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు రాజకీయం అంటే తెలియదని, మానవత్వం మాత్రమే తెలుసునని పెర్కోన్నారు. డబ్బుతో సమాజంలో మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఆ దేవుడితో సమానంగా భావిస్తున్నామని, డాక్టర్లను జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటుందని పవన్ పేర్కొన్నారు.

అలవాటులో.. బాబు తడబాటు

Submitted by arun on Thu, 11/29/2018 - 12:19

టిడిపి అధినేత చంద్రబాబు ఖమ్మంలో చేసిన ప్రసంగం ఇది ప్రసంగం చివరిలో మహాకూటమి నేతలను పేరు పేరునా ప్రస్తావించిన సందర్భంలో కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితిని చంద్రబాబు తెలంగాణ జనసేన అంటూ ప్రస్తావించారు.. ఒకసారి కాదు.. రెండుసార్లు..పరధ్యాన్నంలోనే చంద్రబాబు ఇలా కామెంట్  చేసేశారా? ఏపీలో  ఒకప్పుడు మిత్రుడుగా ఉన్న పవన్  కల్యాణ్ జనసేన ఈసారి ప్రతిపక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తోంది.

తెలంగాణ పోరుపై జనసేన దారెటు...అభ్యర్థులను బరిలోకి...

Submitted by arun on Thu, 10/11/2018 - 11:06

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా...లేదా..ఇక్కడా అక్కడా అభ్యర్థులను బరిలోకి దింపుతానన్న పవన్, ఎన్నికల తేదీలూ వచ్చినా ఎందుకు యాక్టివ్‌గా లేరు...తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించకపోతే, ఇక తమదారి తాము చూసుకుంటామన్న ఆశావహుల అల్టిమేటంపై పవన్‌ ఆలోచిస్తున్నదేంటి...తెలంగాణలో పోటీపై అసలు జనసేనాని అంచనాలేంటి? త్వరలో సమావేశమై ఏదో ఒకటి చెబుతారని వస్తున్న వార్తల సారాంశమేంటి?

పవన్‌కల్యాణ్‌ ఇంకా.... పార్ట్‌టైమరేనా?

Submitted by santosh on Fri, 09/21/2018 - 10:42

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తా? ప్రభుత్వ అవినీతిపై పోరాడతానంటూ పవన్ కల్యాణ్‌ చేపట్టిన ప్రజా పోరాట యాత్ర‌కు బ్రేకిచ్చి... దాదాపు నెలరోజులు దాటిపోతోంది. కంటి ఆపరేషన్‌తో యాత్రకు విరామిచ్చిన జనసేనాని... మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక జనసేన నేతలు, కార్యకర్తల్లో అమోమయం గందరగోళానికి గురవుతున్నారు. మూడు జిల్లాలు ముగిసేలోపే మూడుసార్లు బ్రేకిచ్చిన పవన్‌... మిగతా జిల్లాల్లో... ఎప్పుడు పోరాట యాత్రను కంప్లీట్‌ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు పోరాట యాత్ర ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు.

తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

Submitted by arun on Tue, 09/11/2018 - 15:40

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియజకవర్గానికి చెందిన రాజకీయ నేత పితాని బాలకృష్ణ జనసేనలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గా పితాని బాలకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పవర్ఫుల్ పొత్తు, మరి ఎందరు చిత్తు?

Submitted by arun on Fri, 08/03/2018 - 14:36

పవర్ స్టార్ పవన్ వెళ్తాడట,

2019 ఎన్నికల్లో పొత్తుకి,

లెఫ్ట్ పార్టీకే చెప్పాడట రైట్ అని, 

కలిసి పోరాడితే పోయేది,

Tags

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రూటు మారుస్తున్నారా...బహిరంగ ప్రకటన ఇవ్వడం దేనికి సంకేతం?

Submitted by arun on Fri, 07/27/2018 - 11:55

ప్రత్యర్ధులపై పంచ్ లేస్తూ ఉర్రూతలూగించే ప్రసంగాలు చేసే వపన్ కల్యాణ్ ఇప్పుడు తన రూటు మార్చుకుంటున్నారా? ప్రత్యర్ధి  సహనాన్ని పరీక్షిస్తున్నా.. సహనంతోనే అడుగులేస్తున్నారా? గతంలో అభిమానులను కంట్రోల్ చేయని పవన్ ఇప్పుడు మాత్రం ట్రోలింగ్ చేయద్దంటూ బహిరంగ ప్రకటన ఇవ్వడం దేనికి సంకేతం?

బీజేపీతో పొత్తుపై తేల్చేసిన జనసేనాని!

Submitted by arun on Sat, 07/21/2018 - 13:47

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని గట్టిగా బదులిచ్చారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు వచ్చే లాభమేంటని జనసేనాని ప్రశ్నించారు? ప్యాకేజీకి ఒప్పుకొని మళ్లీ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్విట్టర్ లోనే కౌంటర్ ఎటాక్ చేశారు .

అవిశ్వాసం పెడితే.. పార్టీల మద్ధతు కూడగడతా అన్న పవన్ ఎక్కడ..?

Submitted by arun on Sat, 07/21/2018 - 11:43

ఒకరు పోరాడారు మరొకరు పోరాటంలో లేకుండా పోయారు. ప్రత్యేక హోదాయే లక్ష్యంగా సాగిన రాజకీయాల్లో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల పోరాటం ముగిసినట్లేనా..? నాలుగేళ్లు కలిసి కాపురం చేశాక ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంటూ ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ పట్ల కేంద్రం వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టింది. ఇటు ప్రతిపక్ష వైసీపీ మాత్రం రాజీనామాలు చేస్తామని చెప్పి చేసి చూపించింది. ఇక్కడితో కేంద్రంపై ఈ రెండు పార్టీల పోరాటం ముగిసినట్లే అని భావిస్తున్నారు. 

టీడీపీపై పవన్ ట్వీట్ వార్...టీడీపీని గజని సినిమా హీరోతో పోల్చిన పవన్

Submitted by arun on Sat, 07/21/2018 - 10:52

టీడీపీ నేతలపై పవన్ ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. అవిశ్వాసం చర్చ ముగిసిన తర్వాత టీడీపీపై జనసేనాని ట్వీట్ వార్ ప్రారంభించారు. టీడీపీని గజని సినిమా హీరోతో పోల్చిన పవన్ టీడీపీ నేతలకు మతిమరుపు జబ్బు సోకినట్లుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ గజనిలా ప్రవర్తిస్తోందన్నారు. మొన్నటి వరకు ప్యాకేజీ అన్న టీడీపీ నేతలు ఇప్పడు హోదా అంటున్నారనీ మళ్ళీ మాట మార్చరనే గ్యారెంటీ ఉందా అని పవన్ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు ఏపీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి పవన్ ట్వాట్టర్‌లో కామెంట్ చేశారు.