india

2 గంటలకు భారత్‌కు శ్రీదేవి భౌతికకాయం

Submitted by arun on Sun, 02/25/2018 - 13:35

ప్రముఖ సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారత్‌కు తీసుకరానున్నారు. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. శనివారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ముంబైకి తీసుకొచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాలీవుడ్ వర్గాలు సమాచారం. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 

ఒకటి కాదు, రెండు కాదు పది లక్షల కోట్ల లూటీ

Submitted by arun on Sat, 02/24/2018 - 12:01

జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి...డబ్బులతో నింపండి....అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగానే పిలుపునిచ్చారు. పాపం జనం కూడా ప్రధాని మాట విని, బ్యాంకుల్లో డబ్బు జమ చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో పెద్ద మొత్తంలో అకౌంట్లలో వేశారు. ఇప్పుడు ఆ అకౌంట్లే లక్ష్యంగా బడాబడా పారిశ్రామిక దొంగలు దోచుకెళ్తున్నారు. నిన్న విజయ్ మాల్యా, నేడు నీరవ్‌ మోడీ, రేపు ఇంకెందరో...ఇలా లెక్కేసుకుపోతే, పారిశ్రామికవేత్తలు బ్యాంకులను దోచేసింది ఎంతో తెలుసా...

మోడీ హ‌యాంలోనే అవినీతి కంపు

Submitted by arun on Fri, 02/23/2018 - 10:46

అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ అధికారం చేపట్టారు. అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ...

అదే జోరు.. అదే దూకుడు..

Submitted by arun on Sat, 02/17/2018 - 10:28

జోరు తగ్గలేదు.. ఊపు ఆగలేదు.. నామమాత్రమైన చివరి వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్  చేశారు. ఆతిథ్య జట్టుపై కనీస కనికరం లేకుండా.. విరుచుకుపడ్డారు. సెంచూరియన్ వన్డేలో విక్టరీ కొట్టి.. సరికొత్త చరిత్రను సృష్టించారు. గతంలో ఎవరికీ సాధ్యం కాని లెవెల్లో వన్డే సిరీస్ ను చేజిక్కించుకున్నారు. టెస్ట్ సిరీస్  ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. 5-1 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని.. సౌతాఫ్రికా ఓటమిని పరిపూర్ణం చేశారు. 

ఐ ల‌వ్ పాకిస్థాన్

Submitted by lakshman on Wed, 02/14/2018 - 06:44

 కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల  ప్ర‌చార స‌మ‌యంలో పీఎం మోడీ  నీచ జాతికి చెందిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేశారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ కామెంట్లతో ఒక్కసారిగా గుజరాత్‌ క్యాంపెనింగ్‌ తీరునే మార్చేశారు నరేంద్ర మోదీ. ఈ కామెంట్లతో గుజరాతీ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. తాను అచ్చమైన గుజరాతీనని, అయ్యర్ కామెంట్లు రాష్ట్ర ప్రజలందరిపైనా చేసినవని, బీసీని అయినందుకే ఇలాంటి నీచ్ వ్యాఖ్యలు చేశారని కులం కార్డుతో కుమ్మేశారు.

మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

Submitted by lakshman on Thu, 02/08/2018 - 05:10

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో  భారత్ ఘనవిజయం సాధించింది. 6 వన్డేల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 304 పరుగుల స్కోరుతో వీర విహారం చేసింది. కెప్టెన్ కోహ్లీ 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే, ధవన్ 76 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆల్ రౌండర్ డుమిని రెండు వికెట్లు పడగొట్టాడు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఏదీ కలిసిరాలేదు. బ్యాట్స్‌మన్ ఆమ్లా తక్కువ స్కోరుకే ఔట్ అవడంతో టీమ్ ఇండియాను ఇతర ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు.

భారత కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా

Submitted by arun on Sat, 02/03/2018 - 17:16

న్యూజిలాండ్ లో ముగిసిన ఐసీసీ జూనియర్ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులకు బీసీసీఐ భారీగా నజరానాలు ప్రకటించింది. పృథ్వీ షా నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు 30 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ కు 50 లక్షల రూపాయలు, సహాయ సిబ్బందికి 20 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ప్రకటించింది. ఆరేళ్ల విరామం తర్వాత జూనియర్ ప్రపంచకప్ టైటిల్ గెలుచుకొన్న భారతజట్టును ప్రధాని నరేంద్ర మోదీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్, ఇతర ప్రముఖులు అభినందించారు.
 

భారత కుర్రాళ్లకు ద్రావిడ్ హ్యాట్సాఫ్

Submitted by arun on Sat, 02/03/2018 - 15:03

భారత కుర్రాళ్లు ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ విజేతలుగా నిలవడంతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పొంగిపోతున్నారు. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకూ తమ కుర్రాళ్లు స్థాయికి తగ్గట్టుగా ఆడారని నాణ్యమైన శిక్షణ సిబ్బంది శ్రమ కూడా ఈ అసాధారణ విజయానికి కారణమని ద్రావిడ్ చెప్పారు. గత ప్రపంచకప్ లో ద్రావిడ్ కోచ్ గా రన్నరప్ స్థానం సాధించిన భారత్ ఈసారి మాత్రం ఏకంగా ప్రపంచ చాంపియన్ గా నిలవడం విశేషం.

ఆగస్టు నుంచే ఆయుష్మాన్‌ భారత్‌!

Submitted by arun on Sat, 02/03/2018 - 13:12

దేశవ్యాప్తంగా వైద్యబీమా సంరంభం మొదలవుతోంది. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు తాజా బడ్జెట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం భారీస్థాయిలో ‘జాతీయ ఆరోగ్య బీమా’ పథకాన్ని తెర మీదికి తెచ్చింది. వాస్తవానికి ఇదే తరహా పథకం మన తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరిట గత 11 ఏళ్లుగా అమలవుతోంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత ఆరోగ్య బీమా పథకాలను పరిశీలించాకే తాము కేంద్ర పథకానికి రూపకల్పన చేసినట్టు నీతిఆయోగ్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రాల్లో ఈ వైద్య బీమా సేవలపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.