india

వజ్రాలని మన దేశమే అందించింది

Submitted by arun on Wed, 09/12/2018 - 15:55

భారతదేశంలోనే మొదట వజ్రాలని గుర్తించారు, ప్రాముఖ్యత కూడా పొందింది మరియు తవ్వబడింది. అమెరికాకు చెందిన జమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, 1896 వరకు ప్రపంచమ్లో వజ్రాల గురించి అంత తవ్వకాలు లేవట. అప్పటివరకు ప్రపంచానికి వజ్రాలను ఒక్క భారతదేశం మాత్రమే సప్లై చేసేదట. శ్రీ.కో.

పాకిస్థాన్ రూపాయి ఇండియాలో!

Submitted by arun on Fri, 09/07/2018 - 14:19

మీకు తెలుసా! పాకిస్థాన్ దేశంగా ఏర్పడ్డ తరవాత కుడా రూపాయల ముద్రణకి  సౌకర్యాలు లేక, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియానే, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ముద్రతో వారి రూపాయలను తాత్కాలికంగా జారీ చేసింది. ఆ తరువాత వారు 1948 లో ముద్రించారట. శ్రీ.కో.

చిచ్చు పెడుతున్న మతరాజకీయం

Submitted by arun on Tue, 08/07/2018 - 12:07

జిజ్యా పన్ను గురించి చరిత్రలో చదువుకున్నాం. ఉత్తర భారతాన్ని పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ మొదట హిందువులపై ఈ పన్ను విధించాడు. 16 వశతాబ్దిలో అక్బర్ ఆ పన్ను తొలిగించాడు. 17వ శతాబ్దిలో ఔరంగాజేబు ఆ జిజ్యా పన్ను మళ్ళీ విధించాడు అప్పట్లో ఆ పన్ను చెల్లించని వారిని గడ్డం పీకుతూ హింసించేవారు. మత మార్పిడి చేసుకోవాలని వేధించే వారు. ఇప్పుడు అదే గడ్డం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అంతేకాదు అదే తరహాలో మత మార్పిడి చేయిస్తామని, గడ్డం పెంచుకునేలా చేస్తామని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేలా నాయకులను ప్రేరేపించింది.

డోనాల్డ్ ట్రంప్ కు భారత్ షాక్.. అమెరికా దిగుమతులపై సుంకాల పెంపు..!

Submitted by arun on Sat, 08/04/2018 - 16:51

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాణిజ్య యుద్దానికి తెరతీస్తున్నారు. అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతోంది. ఆ లిస్ట్ లో భారత్ కూడా ఉంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ చైనా, రష్యాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచాయి. అయితే సుంకాల పెంపు నుంచి భారత వస్తువులను మినహాయించాలని కోరగా అమెరికా తిరస్కరించింది. 

Tags

గోతులకు 3,597 మంది బలి

Submitted by arun on Mon, 07/16/2018 - 13:53

లక్షలు పోసి కొన్న వాహనాలు ఎన్నో సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అయినా యాక్సిడెంట్ లు జరుగుతాయి. తాగి వాహనాన్ని నడపరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయరు అయినా ప్రాణాలు పోతున్నాయి. ఎదురుగా వాహనాలు రావు, అదుపు తప్పి ఏ చెట్టునూ ఢీ కొట్టరు అయినా ఆస్పత్రుల పాలవుతారు రహదారులపై పడిన గుంతలు నిండు జీవితాలను బలి తీసుకుంటున్నాయి దేశ వ్యాప్తంగా వేలల్లో ప్రమాదాలకు వందల్లో మరణాలుకు గుంతల రోడ్లు కారణమవుతున్నాయి.

ఆరో పెద్ద ఆర్ధిక వ్యవస్థ

Submitted by arun on Fri, 07/13/2018 - 12:41

ఆరో పెద్ద ఆర్ధిక వ్యవస్థ మనది,

అయిన తప్పని అవస్థలు మనవి,

ఫ్రాన్సును వెనక్కి నెట్టామట మనం,

అయినా దొరుకుతుందా పేదోడికి అన్నం. శ్రీ.కో

గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొచ్చా.. లేదా..లిఫ్ట్ డౌట్‌ను పటాపంచలు చేసిన హెచ్ఎంటీవీ

Submitted by arun on Thu, 06/28/2018 - 17:32

గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొచ్చా.. లేదా..? ముంబైలో ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి.. 15 వందలు ఫైన్ కట్టిన తర్వాత చాలామందిలో ఇదే సందేహం. అందుకే.. ఇవాళ హెచ్ఎంటీవీ మీ డౌట్ క్లియర్ చేయబోతోంది. చట్టంలో ఉన్నదేంటి.? ముంబైలో జరిగిందేంటి.? పోలీసులు చేసిందేంటి.? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇక్కడే సమాధానం దొరకబోతోంది. ఇది చూశాక.. లిఫ్ట్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి.

Tags

టెస్ట్ క్రికెట్లో శిఖర్ ధావన్ అరుదైన సెంచరీ

Submitted by arun on Thu, 06/14/2018 - 17:56

టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్....టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన సెంచరీ సాధించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా క్రికెట్ కూన అప్ఘనిస్థాన్ తో ప్రారంభమైన అరంగేట్రం టెస్ట్ తొలిరోజు ఆట...తొలిసెషన్ లోనే..శిఖర్ ధావన్ శతకం బాది...ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. మురళీ విజయ్ తో కలసి టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించిన ధావన్ కేవలం 87 బాల్స్ లోనే శతకం బాదాడు. ధావన్ సెంచరీలో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. తన కెరియర్ లో 30వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న శిఖర్ ధావన్ కు ఇది ఏడవ సెంచరీ కావడం విశేషం.

చరిత్ర సృష్టించిన భారతీయ శాస్త్రవేత్తలు...కొత్త గ్రహాన్ని కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు

Submitted by arun on Thu, 06/14/2018 - 10:36

ఇప్పటీ వరకు గ్రహాల సంఖ్య ఎంత అంటే...9 అని వెంటనే చెబుతాం. వాటి పేర్లను గుక్క తిప్పు కోకుండా చెబుతాం. ఇక నుంచి గ్రహాలు 9 కాదు...పది భారతీయులు సగర్వంగా చెప్పుకోవచ్చు. అవును భారతీయ శాస్త్రవేత్తలు...10వ గ్రహాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. ఏ దేశానికి సాధ్యం కాని దాన్ని ఇండియన్ సైంటిస్ట్‌లు సుసాధ్యం చేశారు. ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ ప్రొఫెసర్ అభిజిత్ చక్రబర్తీ నేతృత్వంలోని శాస్త్రవేత్త బృందం....పదో గ్రహాన్ని కనిపెట్టి కొత్త చరిత్రను లిఖించారు. 

ప్రజలకు ఆదాయపన్ను శాఖ బంపరాఫర్‌...ఆ సమాచారం ఇస్తే 5 కోట్ల రూపాయలు బహుమతి

Submitted by arun on Sat, 06/02/2018 - 17:37

ప్రజలకు ఆదాయపన్ను శాఖ బంపరాఫర్‌ ఇచ్చింది. బినామీ లావాదేవీలు, బినామీ ఆస్తులు సమాచారం ఇచ్చిన వారికి ....కోటి రూపాయల బహుమతిని అందించాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న దాచుకున్న నల్లధనం సమాచారం చెబితే....5 కోట్ల రూపాయలు బహుమతి అందించనుంది ఆదాయపు పన్ను శాఖ.