india

మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్!

Submitted by arun on Tue, 11/20/2018 - 16:02

టెక్నాలజీ పరిశోధనలో మన బారతదేశం చాల వేగంగా అభివ్రుది చెందుతుంది.. అలాగే మన బారత దేశంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటో మీకు తెలుసా? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు శక్తి. శ్రీ.కో.
 

అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు!

Submitted by arun on Sat, 11/17/2018 - 17:16

ఒక దేశానికి మరో దేశానికి అంతర్జాతీయ సరిహద్దులు కలిగి వుండటం..అతి సాధారణ విషయం, అలానే...మనదేశానికి కూడా చుట్టూ పక్కదేశాలకు మద్య..ఈ సరిహద్దులు వున్నాయి... అయితే...భారతదేశముతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగివున్న దేశం ఏదో మీకు తెలుసా...? భారతదేశముతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగివున్న దేశం బంగ్లాదేశ్...శ్రీ.కో.
 

అతి ఎక్కువగా వరదలు!

Submitted by arun on Thu, 11/15/2018 - 15:35

భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదో మీకు తెలుసా!  అతి ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం అస్సాం. కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదము యొక్క ఆధారం అని  భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి కొంత బలాన్ని ఇస్తున్నాయి...శ్రీ.కో.

టీ 20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా

Submitted by chandram on Sat, 11/10/2018 - 10:12

మహిళల టీ 20 ప్రపంచ కప్‌లో భారత అమ్మాయిలు బోణీ కొట్టారు. గయానా‌లో న్యూజిలాండ్ తో జరిగిన పోరులో టీమిండియా 34 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులను సాధించింది. భారత బ్యాట్స్‌వుమెన్లలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 103, రోడ్రిగ్స్‌ 59 పరుగులు చేశారు. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలింది. భారత బౌలర్లలో హేమలత 3, పూనమ్‌ యాదవ్‌ 3, రాధా యాదవ్‌2, అరుంధతి రెడ్డి ఒక వికెట్‌ పడగొట్టారు.

దేశవ్యాప్తంగా దీవాళి సందడి

Submitted by arun on Wed, 11/07/2018 - 11:51

దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. వెలుగుల పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడుకగా జరుపుకొంటున్నారు. దీపావళి సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలతో ఇళ్లను అందంగా అలంకరించుకున్నారు. మహిళలు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పండుగ రోజున తమ ఇంట లక్ష్మీ దేవిని రా రమ్మని ఆహ్వానిస్తున్నారు. సిరి సంపదలను అందచేయలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.దీపావళి సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తున్నదని వారన్నారు.

మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'

Submitted by arun on Tue, 11/06/2018 - 10:14

మొదటిసారి జరిగిన విషయాలకి చాల ప్రాముఖ్యత వుంతుంది... అల్లా భారతదేశంలోనే  మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు మీకు తెలుసా! మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌' మద్రాసులో స్థాపించారు. శ్రీ.కో.
 

అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ!

Submitted by arun on Sat, 11/03/2018 - 15:54

మన బారత దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏదో మీకు తెలుసా! మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ గోండులు. దాదాపు వీరి సంఖ్య 40 లక్షల పైన ఉంటుందని అంచనా. శ్రీ.కో.

కుప్పకూలిన విండీస్.. టీమిండియా టార్గెట్ 105

Submitted by arun on Thu, 11/01/2018 - 16:03

టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌ విలవిల్లాడింది. భారత్‌పై అతి తక్కువ స్కోరుకే ఆలౌటైంది.  కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లంతా కలిసికట్టుగా రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలోనే చాప చుట్టేసింది. కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 

బ్యాంక్ లలో డబ్బు!

Submitted by arun on Mon, 10/29/2018 - 14:50

బ్యాంక్ లలో డబ్బు దాచుకోవటం బారతియులకు చాల రోజులనుండి అలవాటు.. అయితే మన దేశంలో అతి పురాతనమైన పెద్ద బ్యాంక్ ఏదో మీకు తెలుసా! అది...”స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంక్ లలో పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. ప్రధాన కేంద్రం ముంబై లో ఉన్నది. శ్రీ.కో.
 

భారత్‌పై విషం చిమ్మిన ఇమ్రాన్ ఖాన్

Submitted by arun on Mon, 09/24/2018 - 12:33

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ నోరు పారేసుకున్నారు. ముందు చూపు లేని తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటూ మోడీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పాక్‌తో చర్చలకు భారత్‌ నో చెప్పినందుకు ఇమ్రాన్‌ విషం చిమ్మారు. పాకిస్థాన్ తో చర్చలకు భారత్ వెనక్కి తగ్గడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.