Andhrapradesh

మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ ఎమ్మెల్యే

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 13:42

మావోయిస్టుల చేతిలో ప్రభుత్వ  విప్, అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. అరకులోయ డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది.   ఆదివారం ఎమ్మెల్యే గ్రూపుపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో కిడారి సర్వేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. కాగా ఈ దాడిలో కిడారి సర్వేశ్వరరావు గన్మెన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. సర్వేశ్వరరావు 2014 సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.

పరువు హత్య పోస్టర్ల కలకలం

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 07:58

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య మరవక ముందే తండ్రి చేతిలో విచక్షణ రహితంగా దాడికి గురైంది హైదరాబాద్ కు చెందిన మాధవి. తీవ్ర గాయాలతో మాధవి కోలుకుంటోంది. ఇదిలావులంటే విజయవాడలో ఆకాతాయిలు పెట్టిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యకు గురికానున్న సోని.. రాహు‌.. ప్రియ అని రాసిన పోస్టర్లు వెలిశాయి. విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వీధి నిండా ఈ పోస్టర్లు ఉండటంతో అక్కడున్న ప్రజలు ఏమి జరుగుతుందోనని పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారమందుకున్న పోలీసులు ఇదంతా ఎవరో ఆకతాయిల పనే అని భావిస్తున్నారు. అమ్మాయిని భయపెట్టేందుకు ఇలా చేసి ఉంటారని భావించి.. సోని రాహు‌ ప్రియ ఎవరు?..

రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న పథకానికి సీఎం శ్రీకారం

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 07:26

ఏపీ సీఎం చంద్రబాబు నిన్న తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్‌ డోర్‌ నంబర్ల కేటాయింపునకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..  డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు.  దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఏ సమయానికి అందుతున్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ సేవలన్నీ సరైన సమయం ప్రకారం ప్రజలకు అందించేందుకే డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.

నెల్లూరులో నేడు పవన్ పర్యటన.. భారీ ఏర్పాట్లు..

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 07:18

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు.నెల్లూరు స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు పవన్ హాజరుకానున్నారు. అనంతరం బారాషహీద్‌ దర్గాలో అయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కాగా పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పవన్ రాక సందర్బంగా అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే ప్రతి ఏటా మొహరం  పండుగను పురష్కరించుకుని నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పండుగకు దేశ, విదేశాల నుంచి హిందూ, ముస్లిం ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్... ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు...ఎక్కడి నుంచి పోటీకి...

Submitted by arun on Sat, 09/22/2018 - 16:42

ప్రబోధానంద స్వామి రాజకీయ ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి దాకా ఖాకీ వర్సెస్ జేసీ అన్నట్టు సాగిన రాజకీయం ఇప్పుడు స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్టు మలుపు తిరిగింది. జేసీ సోదరులు కుట్ర పూరితంగా తమ ఆశ్రమంపై దాడి చేశారని ఆరోపిస్తూ స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఇక తానే స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్న దాన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

పరువు హత్య పోస్టర్...సోని, రాహు ప్రియ...

Submitted by arun on Sat, 09/22/2018 - 14:34

విజయవాడ సత్యనారాయణపురంలో వెలసిన పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నగరంలోని సత్యానారాయణపురం శివాలయం వీధిలో  సోని, రాహు ప్రియ త్వరలో పరువు హత్యకు గురికానున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. సత్యనారాయణపురంలో వెలసిన ఈ పోస్టర్లు స్థానికులను భయపెట్టే ఉద్దేశంతోనే వేశారని స్థానికులు భావిస్తున్నారు. అయితే, పోస్టర్లలో ఉన్న సోని, రాహు ప్రియ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాహు ప్రియ ఎవరు? ఏ సమయంలో పోస్టర్లు వేశారు? సీసీకెమరాల్లో రికార్డయిందా?  అని ఆరా తీస్తున్నారు.

పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం : హోంమంత్రి

Submitted by arun on Sat, 09/22/2018 - 13:45

ఖాకీ వర్సెస్‌ ఖద్దర్‌గా మారిన తాడిపత్రి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా జేసీ, పోలీసుల వ్యాఖ్యలపై హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థపై దివాకర్‌రెడ్డి తీరు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్న హోంమంత్రి.. ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఇటు నాలుకలు కోస్తామంటూ ఆవేశంగా మాట్లాడిన పోలీసు సంఘం తీరును కూడా ఆయన తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలు కూడా సమర్థనీయం కాదన్న చిన రాజప్ప రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు. 

త్వరలో రాజకీయాల్లోకి వస్తాం: ప్రబోధనాంద స్వామి

Submitted by arun on Sat, 09/22/2018 - 13:38

కుట్రతోనే తమ ఆశ్రమంపై దాడి జరిగిందన్నారు ప్రబోధానంధ స్వామి. రాజకీయ కుట్రలో భాగంగానే దాడులు చేశారని ఆరోపించారు. స్థానిక ప్రజలను జేసీ సోదరులు రెచ్చగొట్టే తమ ఆశ్రమంపై దాడులు చేయించారని ప్రబోధనాంధ స్వామి తెలిపారు. త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు ప్రబోధానంధ స్వామి. రాజకీయాల ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తే తాము కూడా త్వరలోనే రాజీయాల్లోకి వస్తామని చెప్పారు. తాను ఎవరికి బెదిరేది లేదని ప్రబోధానంధ స్పష్టం చేశారు. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంలేదని ...ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

జగన్‌కు ఊహించని షాక్...సీనియర్ నేత రాజీనామా

Submitted by arun on Sat, 09/22/2018 - 13:08

నెల్లూరు జిల్లాలో జగన్ కి ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌ బొమ్మిడిరెడ్డి రాఘవేంద్రారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ కోసం శక్తి వంచనలేకుండా పనిచేసినా వైసీపీ అధినేత తనను అగౌరపరిచేలా వ్యవహరించారని రాఘవేంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంను వెంకటగిరి ఇన్ ఛార్జిగా నియమించడంపై తీవ్ర అసంతతృప్తితో ఉన్న ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన బొమ్మిడిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఆత్మగౌరవం లేనిచోట తాను ఉండలేనని చెప్పారు. ఆనం చేరికపై వైసీపీ అధినేత తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదన్నారు.

పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డి: సీఎం

Submitted by arun on Sat, 09/22/2018 - 12:02

టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్‌ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి 8నెలల ముందుగానే బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జు‌లుగా నియమిస్తున్నారు. టీడీపీ సంప్రదాయాన్ని పక్కనబెట్టి వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్ధులను ప్రకటించే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి పోటీ చేస్తారని  చంద్రబాబు ప్రకటించారు.