Andhrapradesh

అంగనవాడి టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాల పెంపు..

Submitted by nanireddy on Wed, 06/20/2018 - 18:41

ఆంధ్రప్రదేశ్ లోని అంగనవాడి టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాలు పెంచారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అంగన్వాడీ కేంద్రాల టీచర్ల వేతనాలను 7 వేల 500 రూపాయల నుండి 10 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే ఆయాలకు ఇచ్చే 4500 రూపాయల వేతనాన్ని 6 వేల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

మంత్రి గంటా వైసీపీలో చేరిక గురించి మా ఎంపీ చెప్పారు : బొత్స

Submitted by nanireddy on Wed, 06/20/2018 - 16:44

గతకొద్ది రోజులుగా టీడీపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.నిన్న(మంగళవారం) కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. రేపు విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా... ఆ ఏర్పాట్లను కూడా పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి మంత్రి ఇంటికే పరిమితం అవడం... పార్టీ శ్రేణులను ఆందోళనలో పడేస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో పార్టీ మారుతారని రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అదికూడా ప్రతిపక్ష వైసీపీలో ఆయన చేరిక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) వైసీపీ నేత బొత్స మీడియా సమావేశం నిర్వహించారు.

అన్నం పెట్టండి మహాప్రభో..

Submitted by nanireddy on Wed, 06/20/2018 - 15:52

అన్నం పెట్టండి మహాప్రభో అంటూ వసతి గృహం ఎదుట పలువురు మహిళలు బైఠాయించారు. మూడురోజులుగా వసతి గృహం సూపరింటెండెంట్‌ తమకు తిండి పెట్టడంలేదంటూ ఆరుగురు హాస్టల్‌ మహిళలు మంగళవారం రాత్రి తిరుపతి వసతిగృహం ప్రధానద్వారం ఎదుట బైఠాయించారు. వేరు వేరు ప్రాంతాలకు చెందిన తాము తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ.. వసతి గృహంలో ఉంటున్నామని.. కొద్ది రోజుల కిందటే వసతి గృహంలో తమ గడువు ముగిసినందున రెన్యూవల్ చేయించుకోలేదని సూపరింటెండెంట్‌ తమకు అన్నం పెట్టడం లేదని వాపోయారు. రెన్యువల్‌ చేసుకునేందుకు డీడీలు కూడా కట్టి అధికారులకు పంపకున్నామని వెల్లడించారు.

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు

Submitted by arun on Wed, 06/20/2018 - 13:56

తప్పులను ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తారా అని ప్రశ్నించారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు  రమణదీక్షితులు. టీటీడీ తనకు నోటీసులిచ్చిందని, వందకోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు ఆయన తెలిపారు. అంటే స్వామివారి పరువు వందకోట్లేనని తేల్చేశారని అన్న రమణదీక్షితులు... ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వమా అని ప్రశ్నించారు. స్వామివారి పరువు విలువ  వందకోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు .తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీవారికి అన్ని పూజలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష ప్రారంభం

Submitted by arun on Wed, 06/20/2018 - 12:41

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్షకు దిగారు. ముందుగా గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు సీఎం రమేష్‌ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పోట్లదుర్తి నుంచి భారీ ర్యాలీతో కడప దీక్షా శిబిరానికి సీఎం రమేష్‌ చేరుకున్నారు.
 

ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు..

Submitted by arun on Wed, 06/20/2018 - 09:54

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించి, మరొరికితో పెళ్లికి ఒప్పుకుందని లహరి అనే యువతిని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ పై తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాపూజీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరుతో కిరణ్‌ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది.

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కొత్త మెనూ

Submitted by arun on Wed, 06/20/2018 - 09:36

మూడు రోజుల కోడికూర, రోజుకో అల్పాహారం, రోజూ పాలు, అరటి పండు...ఇది ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మెనూ. హస్టళ్లలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం కొత్త ఆహార పట్టికను రెడీ చేసింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభిస్తే...ఈ ఏడాది కొత్త మెనూ అమలు కానుంది.

ముగింపు దశకు వచ్చిన వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం...మళ్లీ గెలుస్తామని వైసీపీ ఎంపీల ధీమా

Submitted by arun on Wed, 06/20/2018 - 08:03

వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం ముగింపు దశకు వచ్చేసింది. స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకుని భారత్ తిరిగి రావడంతో ఇక రాజీనామాల ఆమోదం లాంఛనమే అంటున్నారు పార్టీ శ్రేణులు. కొంత కాలంగా నానుతూ వచ్చిన ఈ వ్యవహారం ఎట్టకేలకు చివరి దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌  విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చారు. దీంతో వైసీపీ ఎంపీలు మళ్లీ తమ రాజీనామాలు ఆమోదించుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాజీనామాల పని పూర్తి కాగానే ఉప ఎన్నికలకు షెడ్యూలు ప్రకటిస్తారని, మరో రెండు లోక్‌సభ స్థానాలతోపాటు తమ స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు.

Tags

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

Submitted by arun on Wed, 06/20/2018 - 07:01

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల డిమాండ్లపై కమిషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే అగ్రిగోల్డ్ సమస్యను 21 రోజుల్లో పరిష్కరించాలటూ సీఎస్‌‌కు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా లక్షమందికి పెన్షన్లు, మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌ల అప్పగింతపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా గైర్హాజర్

Submitted by arun on Tue, 06/19/2018 - 16:03

కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టారు. భీమిలిలో ఈ సారి ఓడిపోవడం ఖాయమంటూ వార్తలు వస్తుండటంతో కినుక వహించిన గంటా విశాఖలో ఇంటికే పరిమితమయ్యారు. జ్వరం కారణంగానే ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీఎంకు కూడా ముందుగానే సమాచారం అందించినట్టు పేర్కొంటున్నారు.