World cup 2011: ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై క్రిమినల్ ఇన్విస్టిగేషన్.. ప్లేట్ ఫిరాయించిన మాజీ మంత్రి మహీందానంద

World cup 2011: ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై క్రిమినల్ ఇన్విస్టిగేషన్.. ప్లేట్ ఫిరాయించిన మాజీ మంత్రి మహీందానంద
x
Highlights

World cup 2011: వన్డే ప్రపంచ కప్ 2011 భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక క్రీడాశాఖ మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

World cup 2011: వన్డే ప్రపంచ కప్ 2011 భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక క్రీడాశాఖ మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అలుత్గామాగే వ్యాఖ్య‌ల‌పై మినల్ ఇన్విస్టిగేషన్ మొదలైందని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. అలుత్గామాగే చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఆ దేశంలో పెను దుమారం రేపాయి. దాంతో శ్రీలంక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై స‌మ‌గ్ర‌ విచారణను ఆదేశించింది. ఇప్పటికే మహిదానందను దర్యాప్తు బృందం విచారించింది. ఫిక్స్ అరోప‌ణ‌ల‌పై క్రిమినల్ ఇన్విస్టిగేషన్‌ను కూడా ప్రారంచిందని.. ఈ మేర‌కు లంక క్రీడా శాఖ సెక్రటరీ కెడిఎస్ రువాన్‌చంద్ర పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ కేసుపై స్పెషల్ పోలీస్ బృందం పనిచేస్తోంది. అతి త్వరలోనే ఈ ఆరోపణల్లో నిజనిజాలను దర్యప్తు విభాగం బయటపెడుతుందని రువాన్ చంద్ర తెలిపారు. ఇక 2011 వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ ఫిక్సింగ్ అయింద‌న్న‌ మహీందానంద.. ఈ ఫిక్సింగ్‌లో లంక ప్లేయ‌ర్లు ఎవ‌రూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయన్నారు. ఈవిష‌యమై ఆధారాలున్నట్లు మహీందానంద అన్నారు. అయితే పోలీసుల విచార‌ణ‌లో మాత్రం ప్లేట్ ఫిరాయించాడు.

భార‌త్ - శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనేది తన అనుమానం మాత్రమేనని అన్నారు. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని అక్టోబర్‌ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చానని.. పోయిన వార‌మే పోలీసుల విచారణ అనంతరం మీడియాకు చెప్పారు.

మహీందానంద వ్యాఖ్య‌ల‌ను శ్రీలంక ప్రభుత్వం మాత్రం సిరీయ‌స్ గా తీసుకుంది. సొంత ప్ర‌యోజ‌నాల‌కోస‌మే ఈ వ్యాఖ్య‌లు చేశారా? దీనిలో ఎదైనా రాజ‌కీయ కోణం ఎదైనా ఉందా అని అనుమానంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సీరియస్ ఇన్విస్టిగేషన్ ప్రారంభించింది. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరపనున్నారు.

మాజీ మంత్రి ఆరోపణలపైశ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్‌ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా' అని చురకలంటించాడు. కుమార సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ 97 పరుగులు , సారథి ధోని 91 నాటౌట్ యువరాజ్ సింగ్ 21పరుగులతో రాణించారు. ఈ విజ‌యంతో 1983త‌ర్వాత ధోని నాయ‌క‌త్వంలో భార‌త్ 30 ఏళ్ల క‌ల‌ను తీర్చుకోగ‌లిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories