Mithali Raj about MS Dhoni: ధొనీ కుర్రాళ్లందరికీ ఆదర్శం: మిథాలీ రాజ్

Mithali Raj about MS Dhoni: ధొనీ కుర్రాళ్లందరికీ ఆదర్శం: మిథాలీ రాజ్
x
Mithali Raj (File Photo)
Highlights

Mithali Raj about MS Dhoni: ఎంఎస్ ధొనీ లాంటి ఆటగాడు మళ్లి రాడని టీంఇండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది.

Mithali Raj about MS Dhoni: ఎంఎస్ ధొనీ లాంటి ఆటగాడు మళ్లి రాడని టీంఇండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. 'ప్రతి క్రికెటర్ కు ధొనీ ఓ ప్రేరణ. అతడు చేతల మనిషి. దేశానికి ప్రాతినిధ్యం వహించాలని భావించే చిన్న పట్టణాలకు చెందిన కుర్రాళ్లందరికీ ధోని ఆదర్శం. క్రికెట్ పుస్తకాల్లో లేని హెలికాప్టర్ షాట్ ధొనీ కి మాత్రమే సాధ్యం. అలాంటి ఆటగాడు మళ్లి రాదు. అతడు ఎప్పటికీ దిగ్గజమే' అని మిథాలీ రాజ్ పేర్కొన్నారు.

ఇక కొద్దికాలంగా ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు ఆ వార్తలకు చెక్ పడుతూనే వస్తోంది. అయితే, ఇప్పుడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. అంతే కాదు, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్‌లోనూ ఓ పవర్ హిట్టర్‌ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ధోనీ.. కెప్టెన్‌గానూ 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. రాంచీ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో శుక్రవారం అక్కడికి వెళ్లిన ధోనీ.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌కి హాజరైన గంటల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆర్మీలో కొన్ని రోజులు పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత టీమిండియా సెలక్షన్‌కి దూరంగా ఉండిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories