West Indies vs South Africa: సెమీస్ లో నిలవాలంటే గెలవాల్సిందే..!!

T20 World Cup 2021 West Indies vs South Africa Match In Dubai Cricket Stadium Today 26 10 2021
x

West Indies vs South Africa: సెమీస్ లో నిలవాలంటే గెలవాల్సిందే..!! 

Highlights

* దక్షిణాఫ్రికా - వెస్టిండిస్ మధ్య నేడు టీ20 మ్యాచ్

West Indies vs South Africa: అక్టోబర్ 26న మంగళవారం రోజున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వెస్టిండిస్ - దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్ తో మరో బిగ్ ఫైట్ కి వేదిక కానుంది. ఇప్పటికే గ్రూప్ 1 లో వెస్టిండిస్ జట్టు తన మొదటి మ్యాచ్ ని ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోగా, దక్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమితో మొదలుపెట్టింది. తాజాగా గ్రూప్ 1 నుండి సెమీస్ కి చేరాలంటే ఇరు జట్లకు ఈరోజు మ్యాచ్ విజయం తప్పనిసరిగా మారింది.

డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన వెస్టిండిస్ పేలవ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుండి తేరుకొని ఈ రోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో తమ సత్తాచాటి గెలుపొందాలని పట్టుదలతో ఉండగా దక్షిణాఫ్రికా జట్టు మాత్రం ఓపెనర్ క్వింటన్ డికాక్, మిడిల్ ఆర్డర్ కేశవ్ మహారాజ్ ల బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది. ఇక ఇప్పటివరకు దక్షిణాఫ్రికా - వెస్టిండిస్ మధ్య 15 టీ20 మ్యాచ్ లు జరగగా అందులో దక్షిణాఫ్రికా 9, వెస్టిండిస్ 6 మ్యాచ్ లలో గెలుపొందింది. నేడు జరగబోయే ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండనున్నాయి..

దక్షిణాఫ్రికా జట్టు:

టెంబా బావుమా, క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

వెస్టిండిస్ జట్టు:

లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ , కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్

Show Full Article
Print Article
Next Story
More Stories