సన్‌రైజర్స్‌ ఐదో విజయం..

సన్‌రైజర్స్‌ ఐదో విజయం..
x
Highlights

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో...

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 15 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌(67; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెయిర్‌ స్టో(80 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు‌)లు సన్‌రైజర్స్‌ ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 131 పరుగులు సాధించడంతో సన్‌రైజర్స్‌ ఈ సీజన్ లో ఐదో గెలుపును సాధించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లలో క్రిస్‌ లిన్‌(51; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌(30; 25 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు),సునీల్‌ నరైన్‌(25; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు. దీంతో కోల్‌కతా 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లు కేకేఆర్‌ ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌ రెండు వికెట్లు తీశాడు. సందీప్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories