MI vs RR: వాంఖడేలో ముంబై హ్యాట్రిక్ ఓటమి.. వరుస విజయాలతో రాజస్థాన్ దూకుడు..!

Rajasthan Royals won by 6 wickets against Mumbai Indians
x

MI vs RR: వాంఖడేలో ముంబై హ్యాట్రిక్ ఓటమి.. వరుస విజయాలతో రాజస్థాన్ దూకుడు..!

Highlights

IPL 2024: రాజస్థాన్ జట్టు శుభారంభం చేసింది. అయితే ఆ జట్టు 50 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. కానీ, రియాన్ పరాగ్ బ్యాట్‌తో ఉచ్చు బిగించాడు. అతను 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడం ద్వారా సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది.

MI vs RR Match Report: IPL 2024లో ముంబై వరుస పరాజయాలకు అడ్డుకట్టపడేలా లేదు. ముంబై జట్టు వరుస పరాజయాలు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు తీవ్రమైన బాధను కలిగిస్తున్నాయి. వరుసగా రెండు పరాజయాల కారణంగా కెప్టెన్ హార్దిక్ ఇప్పటికే చాలా ట్రోల్ అవుతున్నాడు. ఇప్పుడు సొంత మైదానం వాంఖడేలో ముంబై ఓటమి ఈ గాయాలను మరింత ఎక్కువ చేసింది. వాంఖడే వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌ ముంబయి అహంకారాన్ని దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అండ్ కంపెనీ 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.

ముంబై వెన్ను విరిచిన ట్రెంట్ బౌల్ట్..

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ డేంజరస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆకలితో ఉన్న సింహంలా ముంబైపై ఆధిపత్యం చెలాయించాడు. తొలి ఓవర్‌లోనే ఖాతా తెరవకుండానే రోహిత్ శర్మ, నమన్ ధీర్‌లకు పెవిలియన్ దారి చూపించాడు. తీవ్ర ఒత్తిడి ఫలితంగా ముంబై కేవలం 20 పరుగుల స్కోరు వద్ద నలుగురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మల విలువైన ఇన్నింగ్స్‌తో ముంబై స్కోరు 100 దాటింది. హార్దిక్ 34 పరుగులు చేయగా, తిలక్ వర్మ 32 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

3 వికెట్లు తీసిన చాహల్..

ట్రెంట్ బౌల్ట్ తర్వాత, యుజ్వేంద్ర చాహల్ కూడా సత్తా చాటాడు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లకు బోల్ట్ పెవిలియన్ దారి చూపించినట్లే.. ఆ తర్వాత, యుజ్వేంద్ర చాహల్ తన వలలో టెయిలెండర్స్ చిక్కుకున్నారు. కాగా, నాంద్రే బర్గర్ 2 వికెట్లు పడగొట్టాడు. పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు 125 పరుగుల స్కోరు వద్ద ఆగిపోయింది. రియాన్ పరాగ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ సులువుగా సాధించింది.

మరోసారి ఆకట్టుకున్న రియాన్ పరాగ్..

రాజస్థాన్ జట్టు శుభారంభం చేసింది. అయితే ఆ జట్టు 50 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. కానీ, రియాన్ పరాగ్ బ్యాట్‌తో ఉచ్చు బిగించాడు. అతను 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడం ద్వారా సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. అదే సమయంలో ఈ సీజన్ ముంబైకి పీడకలగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories