4వ వన్డేలోనూ భారత్‌కు తప్పని ఓటమి

New Zealand Defeated India by 63 Runs
x

4వ వన్డేలోనూ భారత్‌కు తప్పని ఓటమి 

Highlights

New Zealand Women vs India Women: న్యూజిలాండ్​తో జరిగిన 4వ వన్డేలోనూ భారత మహిళా క్రికెట్​జట్టు ఓడిపోయింది.

New Zealand Women vs India Women: న్యూజిలాండ్​తో జరిగిన 4వ వన్డేలోనూ భారత మహిళా క్రికెట్​జట్టు ఓడిపోయింది. 63 పరుగుల తేడాతో మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకే కుదించారు. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించలేకపోయింది. 17.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్​అయింది. రిచా ఘోష్ 52 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా కెప్టెన్ ​మిథాలీ రాజ్ 30 పరుగులతో నామమాత్రంగా ఆడగా మిగతా ప్లేయర్స్‌ అంతా బ్యాటింగ్‌లో విఫలమయ్యారు.

అంతకుముందు టాస్​ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యుజిలాండ్ అమెలీయా కెర్ 68 పరుగుల హాఫ్​సెంచరీతో మెరవగా బేట్స్​41, సోఫీ డివైన్ 32, సాటర్​32 పరుగులతో రాణించారు. ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్​ అవార్డు న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియా కెర్‌కు దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచుల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్​ 4-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇక 5వ వన్డే ఈనెల 24న జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories