హైదరాబాద్ లక్ష్యం 150 పరుగులు..

హైదరాబాద్ లక్ష్యం 150 పరుగులు..
x
Highlights

హైదరాబాద్‌, ముంబై జట్ల మధ్య రసవత్తరంగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఎనమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్ కి చెందిన ముంబై జట్టుకి ఆదిలోనే భారీ దెబ్బ పడింది.

హైదరాబాద్‌, ముంబై జట్ల మధ్య రసవత్తరంగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఎనమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్ కి చెందిన ముంబై జట్టుకి ఆదిలోనే భారీ దెబ్బ పడింది. ఆ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ (4) పరుగులకే అవుట్ అయ్యాడు.. కానీ మరో ఓపెనర్ డికాక్‌ మాత్రం దూకుడుగా ఆడాడు.. ఈ క్రమంలో సందీప్‌ వేసిన నాలుగో బంతి డికాక్‌(25) కూడా అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్, ఇషాన్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. అయితే జట్టు స్కోర్ 81 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది ముంబై జట్టు . సూర్యకుమార్ (36), కృనాల్‌ డకౌట్‌ అయ్యారు.. ఇక ఆ వెంటనే తివారి (1) ఔట్‌ కూడా అవుట్ అవ్వడంతో ఆ జట్టు కేవలం 82 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయింది. ఒకపక్కా వికెట్ల పడుతున్నా మరోపక్కా మాత్రం ఇషాన్ (33) జట్టును ఆదుకున్నాడు .. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోర్ పెంచాడు.

అయితే మళ్ళీ 17 ఓవర్ లో ముంబైకి కష్టాలు ఎదురయ్యాయి.. సందీప్‌ శర్మ వేసిన 17 ఓవర్ లో ఇషాన్ (33), 18 ఓవర్ లో కౌల్డర్‌నైల్ (1) వెంటవెంటనే ఔట్ అయ్యారు.. దీనితో నిర్ణిత 20 ఓవర్లు అయిపోయేసరికి ముంబయి జట్టు ఎనమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ హైదరాబాదుకి చావోరేవో కాగా, ముంబై ఈ పోరులో గెలిచి లీగ్ మ్యాచ్‌లను విజయంతో ముగించాలని చూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories