సిరీస్ సమం చేసిన భారత్..

సిరీస్ సమం చేసిన భారత్..
x
Highlights

రెండో టీ20 లో న్యూజిలాండ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం. ముందుగా బ్యాటింగుకు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు...

రెండో టీ20 లో న్యూజిలాండ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం. ముందుగా బ్యాటింగుకు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు టీమ్‌ సెఫార్టీ(12), కొలిన్‌ మున్రో(12)లు తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన డార్లీ మిచెల్‌(1), కేన్‌ విలియమ్సన్‌(20)ఔట్ కావడంతో కివీస్‌ కష్టాల్లో పడింది. ఆ క్రమంలో రాస్‌ టేలర్‌-గ్రాండ్‌ హోమ్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 77 పరుగులు జోడించడంతో కివీస్‌ తేరుకుంది. గ్రాండ్‌హోమ్‌(50; 28 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) , రాస్‌ టేలర్‌ 36 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు. భారత్ బౌలర్లలో కృనల్ పాండ్య 3 , ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, భవనేశ్వర్ కుమార్ , హార్దిక్ పాండ్య చెరో వికెట్ తీశారు.

అనంతరం 159 పరుగుల లక్ష్యంతో ఛేజింగుకు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(50), శిఖర్ ధవన్(30) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత రిషబ్ పంత్(40), విజయ్ శంకర్(14) పరుగులు చేశారు. మ్యాచ్ భారత్ చేతులోకి వస్తుందన్న క్రమంలో శంకర్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత ధోని 20 పరుగులతో పంత్ తో కలిసి భారత్ కు విజయాన్ని అందించారు. దీంతో సిరీస్ సమం చేసింది. ఇక మూడో టీ20 లో సిరీస్ ఫలితం తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories