బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
x
Highlights

బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఆ జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు....

బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఆ జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విశాఖలో ఆదివారం జరిగిన మొదటి టి20లో భారత బౌలర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియా జట్టు చిట్టచివరి బంతికి అనూహ్య విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది ఆసీస్. ఈ క్రమంలో బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి, భారత గడ్డపై మొట్టమొదటి టి20 సిరీస్ గెలవాలని కంగారూలు ఆశ పడుతున్నారు. అయితే టీమిండియా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చెయ్యాలని భావిస్తోంది. కాగా టి20 ప్రపంచ ర్యాంకింగుల్లో 123 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో వుంటే, 119 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories