ఈ దశాబ్దపు మేటి సారథి ధోనీనే..అత్యుత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ

ఈ దశాబ్దపు మేటి సారథి ధోనీనే..అత్యుత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ
x
Highlights

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తూన్నఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్టులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది.

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తూన్నఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్టులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. 2010 నుంచి 2020 మధ్య కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో పాటు..యార్కర్ల కింగ్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ దశాబ్ధాపు బెస్ట్ ఎలెవన్‌‌కు ఎంపికయ్యారు. ఈ టీమ్ కు మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా నియమించారు. ఐసీసీ అభిమానుల ఓటింగ్ ద్వారా అవార్డులు అందజేస్తుందన్న సంగతి తెలిసిందే.

ఈ డికేడ్ అత్యుత్త టీ20 ఎలెవన్‌లో రోహిత్ శర్మ, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌, కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా విద్వాంసక ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌లను, వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ ధోనీని తీసుకుంది. గ్లేన్ మ్యాక్స్ వెల్, వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్ చోటు దక్కించుకున్నారు. అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ స్పెషల్ స్సిన్నర్‌గా.. జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా‌లు పేసర్లుగా జట్టులో చోటు కల్పించింది. టెస్టు జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నియమించింది. ఈ జట్టులో అశ్విన్ కు కూడా స్థానం కల్పింది. మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీకి అవకాశం ఇచ్చింది. వన్డేల, టీ20లకే కెప్టెన్ గా ధోనీని, టెస్టు జట్టుకు కోహ్లీని ఎంపికచేసింది.

అంతేకాదు రెండేళ్లపాటు వేటు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఆటగాడు మాజీ కెప్టెన్ షకీబుల్ హాసన్ కు వన్డే జట్టులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చోటుకల్పించడం విశేషం. భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మకు టెస్టు జట్టులో అవకాశం రాలేదు. మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అందులో దిగ్గజ బ్యాటర్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ టెస్టు ,వన్డే జట్టులో చోటుకల్పింది. సీనియర్ బౌలర్ ఝులాన్ గోస్వామి, హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.





Show Full Article
Print Article
Next Story
More Stories