CSK vs SRH: చెన్నై లక్ష్యం 172; వార్నర్, పాండే అర్థ శతకాలు

Chennai Super kings Target is 172 in 20 Overs
x

హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్, మనీష్ పాండే (ఫొటో ట్విట్టర్)

Highlights

CSK vs SRH: చెన్నై తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

CSK vs SRH: ఢిల్లీలో నేడు చెన్నై తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో చెన్నై ముందు 172 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం.. త్వరగానే ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(7) వికెట్ ను కోల్పోయింది. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో 7 పరుగులు చేసిన బెయిర్‌ స్టో చహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం బ్యాటింగ్ వచ్చిన మనీష్ పాండే తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ధాటిగానే ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న చెన్నై టీం హైదరాబాద్ ముందు తేలిపోయింది. వికెట్లు తీసేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు.

వార్నర్, పాండే కలిసి సెంచరీ భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఈ జోడీని 17.1 ఓవర్లో ఎంగిడి విడదీశాడు. వార్నర్ (57 పరుగులు 55 బంతులు, 3ఫోర్లు, 2సిక్సులు) జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్ లో చివరి బంతికి మనీష్ పాండే (61పరుగులు, 46 బంతులు, 5ఫోర్లు, 1సిక్స్) ను పెవిలియన్ పంపించాడు ఎంగిడి. దీంతో విలువైన భాగస్వామ్యాన్ని విడదీసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన కేన్ మామ(26పరుగులు, 10 బంతులు, 4ఫోర్లు, 1సిక్స్) శార్దుల్ ఠాకూర్ ను ఉతికి ఆరేశాడు. 19 ఓవర్ వేసిన శార్దుల్... ఆ ఓవర్లో కేన్ మామ ధాటికి 20 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే కేదార్ జాదవ్(12 పరుగులు) కూడా చివరి ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు.

దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories